జ'గన్' గురి ఎటువైపు ? ఆ సంగతేంటి ?  

What Is Main Aim Of Ys Jagan-cm Ys Jagan,ys Jagan,ysrcp,అవినీతి,జగన్ గురి ఎటువైపు

వైసీపీ అధ్యక్షుడు జగన్ చివరకు తాను సాధించాల్సింది సాధించేసాడు. ఎప్పటి నుంచో కలలుకంటున్నా సీఎం పీఠం ఎట్టకేలకు ఆయనకు దక్కేసింది. ఈ నెల 30 న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు.ఆ తరువాత కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉంటాయి..

జ'గన్' గురి ఎటువైపు ? ఆ సంగతేంటి ? -What Is Main Aim Of YS Jagan

ఎన్నికల హామీలు, పరిపాలన అనే అంశాలపై జగన్ బిజీ అయిపోతాడు. అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ ద్రుష్టి మొత్తం ప్రభుత్వ పాలనపై పెడతాడా లేక ఇప్పటివరకు తనని అన్నిరకాలుగా కక్షసాధించిన రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించే పని చేపడతారా అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. టీడీపీ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయని చెప్పిన జగన్ వాటిపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకుని వాటి మీద ఒక అభిప్రాయానికి వచ్చేసారట.

ముఖ్యంగా రాజధాని భూముల విషయంలో జరిగిన అనేక అవకతవకల మీద జగన్ దృష్టిసారించే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజధాని ఎక్కడ వస్తుందో డిసైడ్ చేసిన చంద్రబాబు ముందుగానే తన బినామీలతో అమరావతి చుట్టుపక్కల భూములు కొనిపించారనీ, రైతుల నుంచీ బలవంతంగా భూములు లాక్కున్నారనీ, ఆ భారీ స్కాంను బయటపెడతానని అన్నారు. ఇక పోలవరం టెండర్, పోలవర్ ప్రాజెక్టు విషయంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయన్న జగన్ వీలైతే కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పరు. జగన్ చెబుతున్న విషయాలను బట్టి టీడీపీ ప్రభుత్వం లో చోటుచేసుకున్న ఏ అంశాన్ని వదిలిపెట్టేందుకు ఆయన సిద్ధంగా లేడు అనే విషయం అర్ధం అవుతోంది.

జగన్ కనుక గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమల మీదే తన ఫోకస్ అంతా పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటిపడే ప్రమాదం ఉంది. గతాన్ని తవ్వడం కంటే ముఖ్యమైన అంశం అభివృద్ధి. ప్రజలు జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ నవరత్నాలు, ఇతరత్రా హామీలన్నీ వెంటనే అమలు చెయ్యాల్సి ఉంది.

వాటి కోసం భారీగా నిధులను సమీకటించి సమర్థవంతంగా వాటిని అమలు చేయడం ముఖ్యమైన అంశం. నిధులు కావాలంటే పరిశ్రమలు రావాలి. పన్నుల ఆదాయం పెరగాలి.

లేదా పన్నులు సక్రమంగా వసూలవ్వాలి. ఇలాంటి అంశాలపై జగన్ దృష్టిపెడితే ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని అప్పుడే జగన్ ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు మేలు జరుగుతుందనేది ఆర్థిక నిపుణుల వాదన. జగన్ ఈ రెండు దారుల్లో ఏ దారి వెతుక్కుంటాడో చూడాలి.