ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ నిర్ణయం ఏంటో?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేందుకు ఓకే చెప్పారు.అయితే ప్రభుత్వం కండీషన్స్‌ ఏమీ పెట్టకుండా కార్మికులందరిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

 What Is Kcr Take The Decission About Rtc Strike-TeluguStop.com

బేషరతుగా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రెండు సార్లు గడువు విధించాడు.ఆ గడువు ముగిసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీకి చెందిన వారే కాదని, వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న వారు అవుతారంటూ కేసీఆర్‌ ప్రకటించాడు.

ఇలాంటి సమయంలో కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు అంటూ అందరు ఎదురు చూస్తున్నారు.మొదటి నుండి కూడా ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ కోపంగానే ఉన్నాడు.

సమ్మె చేయించిన కార్మిక సంఘాల నాయకులు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్‌ను ఆర్టీసీ కార్మికులు ఇష్టానుసారంగా బండ బూతులు తిట్టారు.

అందుకే ఇప్పుడు ఏం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube