టీఆర్ఎస్ పరిస్థితేంటి ? కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ?  

What Is Kcr Next Step For Trs Party-chandrababu Naidu,congress,exit Poll Result,kcr,tdp,trs,కేసీఆర్ ఏం చేయబోతున్నాడు,టీఆర్ఎస్ పరిస్థితేంటి

తెలంగాణాలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతూ అందరిని ఏకం చేసేపనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ పట్నాయక్ , మమతా బెనర్జీ , స్టాలిన్ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతల చుట్టూ కేసీఆర్ తిరిగాడు..

టీఆర్ఎస్ పరిస్థితేంటి ? కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ? -What Is KCR Next Step For TRS Party

వీరంది సహకారంతో పెడరల్ ఫ్రంట్ కి ఊపు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంతలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవ్వడంతో కేసీఆర్ తీవ్ర నిరాశలో ములిగిపోయాడట.

అసలు కేసీఆర్ ముందుగా భావించిన లెక్క ప్రకారం ఢిల్లీలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాదని, అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయని కేసీఆర్ భావించగా ఎగ్జిట్ పోల్స్ రివర్స్ ఎటాక్ ఇచ్చాయి.

ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే అసలు ఫలితాలు కూడా వస్తే ఆ అవకాశం లేకుండా పోయినట్లేనని అంటున్నారు. ఇది టీఆర్ఎస్ కు నిరాశ కలిగించే అంశమేనని ఆ పార్టీ నేతలు అంటున్నారట. కేసీఆర్ వేసుకున్న అంచనాల ప్రకారం ఫలితాలు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అని సర్వేల ఫలితాలు వచ్చినాసరే కేసీఆర్ ముఖంలో చిరునవ్వు కనిపించడంలేదు అనే చర్చ ఆయన సన్నిహితుల నుంచే వినిపిస్తోంది. కేసీఆర్ లెక్కప్రకారం అంతా అనుకున్నట్టే జరిగితే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను జాతీయ రాజకీయాలలో బిజీ అవ్వాలని కేసీఆర్ భావించారు. వీలైతే ఉప ప్రధాని అవ్వాలని కూడా కేసీఆర్ భావించారు కానీ ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్ ఆశలను అప్పుడే నీరుగార్చేశాయి.

ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం బీజేపీ కేంద్రంలో అధికారం చేపడితే కేసీఆర్ స్టెప్ ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కడంలేదు. గతంలో టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తన పంథా మార్చుకుని బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించింది. అంతే కాదు అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అంటూ కేసీఆర్ సిగ్నల్స్ ఇవ్వడంతో పరిణామాలు మారిపోయాయి.

ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా కేసీఆర్ కు మోదీ అంత ప్రయార్టీ ఇస్తాడా అనేది అనుమానమే. టీఆర్ఎస్ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది టీఆర్ఎస్ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నాయి.