లోకేష్ పవన్ లకు ధీటుగా జగన్ ఏం చేయబోతున్నారంటే ? 

What Is Jagan Going To Do To Lokesh Pawan, Nara Lokesh, TDP, Ysrcp, BJP, Chandrababu, CBN, Janasenani, Ysrcp Government, Ap Government, Ap Cm Jagan,

ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైపోయింది.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా సరే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల తంతులోనే నిమగ్నమయ్యాయి.

 What Is Jagan Going To Do To Lokesh Pawan, Nara Lokesh, Tdp, Ysrcp, Bjp, Chandra-TeluguStop.com

ప్రజల్లో బలం పెంచుకుంటూ, తమ ప్రత్యర్థుల కంటే తామే గొప్ప అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటి నుంచే జనాల్లో పట్టు పెంచుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఏపీ అధికార పార్టీ వైసిపి రాబోయే ఎన్నికల్లో తమదే గెలుపని,  175 కు 175 స్థానాల్లోనూ తామే గెలుస్తామని ధీమా ను వ్యక్తం చేస్తుండగా,  టిడిపి ,జనసేనలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి.తమ రెండు పార్టీల పొత్తుతో ఎన్నికలకు వెళితే తప్పకుండా విజయం తమదేనని బలంగా నమ్ముతున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagandristic, Janasenani, Lokesh, Ysrcp-Pol

ఇక టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిరంతరం జనంలో ఉంటూ.టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో పాటు తన కుమారుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూ ఆయనను యువ గళం పేరుతో ఏపీ అంతటా పాదయాత్ర నిర్వహించే విధంగా పక్కగా ప్లాన్ చేశారు.రాష్ట్రమంతట లోకేష్ పర్యటిస్తూ గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర తరహాలోనే ఏపీ అంతటా పాదయాత్ర నిర్వహించి క్షేత్రస్థాయిలో టిడిపి బలం పెరిగేలా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ నెలలోనే లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం ద్వారా ఏపీ అంతట బస్సు యాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ ఇద్దరు నేతలు మూకుమ్మడిగా వైసిపిని టార్గెట్ చేసుకుని ఈ యాత్రలు మొదలు పెడుతూ ఉండడంతో జగన్ సైతం అలెర్ట్ అవుతున్నారు.లోకేష్ పవన్ యాత్రలకు దీటుగా జగన్ సైతం జిల్లాల యాత్ర చేపట్టాలని తాజాగా నిర్ణయించుకున్నారట.

ఇక వరుస వరుసగా,  జిల్లాలు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ నిత్యం జనాల్లో ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagandristic, Janasenani, Lokesh, Ysrcp-Pol

ఈ పర్యటనల్లోనే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు మరింత వివరంగా చెబుతూ,  మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తే ఇంతకంటే మెరుగ్గా మరిన్ని పథకాలను అమలు చేస్తామని జగన్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube