హరీష్ రావును తోక్కేయడం,ఎంతవరకూ నిజం ?

గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించని హరీష్ రావు నారాయణఖేడ్ ఉప ఎన్నికని వంకగా చూపి అక్కడే ఉండిపోయారు.ఆ ఉప ఎన్నిక ఈ రోజు తెరాస కి తిరుగులేని గెలుపుని ఇవ్వడంతో హరీష్ రావు సత్తా చాటినట్టు అయ్యింది.

 What Is Harish Rao Position In Trs..?-TeluguStop.com

హరీష్ రావును మెదక్ కి మాత్రమే పరిమితం చేసే ఆలోచనలు తీవ్ర స్థాయిలో జరుగుతోంది అన్న వాదన మరొక పక్క వినిపిస్తోంది.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో కూడా హరీష్ ని అందరిలాగానే ఒక్క నియోజికవర్గానికే పరమితం చేస్తూ ఉండడం ప్రాధాన్యత తగ్గిందని అన్న మాటలు మొదలు అయ్యాయి.

అయితే మెదక్‌కు పరిమితం చేసినా అన్ని చోట్ల నుంచి పార్టీ వారు వచ్చి ఆయనను కలుసుకోకుండా ఎవరూ ఆపలేరని సహాయకులొకరు సవాలు చేశారు.అయితే నివాసానికి వచ్చి కలిసే ప్రజా ప్రతినిధుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం కనిపిస్తూనే వుంది.

ఇది ఆయనపై అయిష్టంతో గాక అధినేత కుటుంబ సభ్యులకు ఆగ్రహం వస్తుందనే సంకోచం వల్లనేనని కూడా కొందరు సన్నిహితుల కథనం.ఆచితూచి మాట్లాడే వ్యక్తిగా ఆయన బయిటపడే ప్రసక్తి లేదని అయితే జరిగే పరిణామాలు మౌనంగా గమనిస్తున్నారని చెబుతున్నారు.

ఇవన్నీ ఎన్ని చేసినా పార్టీలో సమాంతర బిందువుగా ఆయన స్థానం చెరిగేది కాదన్న భరోసా కూడా అనుయాయుల్లో వుంది.ఇవన్నీ వున్నా ప్రస్తుతానికి ఒకింత తగ్గి వ్యవహరించడం మంచిదనే ఆలోచనలో వున్నట్టు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube