హరీష్ రావు సంగతి అంతేనా...? పక్కనపెట్టింది నిజమేనా ...?  

టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ… పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ… ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు రాజకీయ ప్రస్థానం ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అంతు చిక్కడంలేదు. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందా … లేదా అనే విషయంలో ఎవరికీ స్పష్టమైన క్లారిటీ రావడంలేదు. వాస్తవంగా చూసుకుంటే…. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీష్ రావు కు ఎక్కడలేని ప్రాధాన్యత పార్టీలో ఉండేది. ఏ వ్యవహారం చక్కబెట్టాలన్నా…. ఆయనకే కేసీఆర్ చెప్పేవారు. అయితే అప్పుడున్న ప్రాధాన్యత… ఇప్పుడున్నట్టుగా కనిపించడంలేదు. అసలు తెలంగాణ ఎన్నికలకు ముందే… కేసీఆర్ పక్కన పెట్టినట్టు వార్తలు వినిపించాయి. దీనిపై టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కేసీఆర్ ఆయనకు తగిన ప్రాధాన్యం కూడా కల్పించినట్టే కనిపించారు.

అయితే ఇప్పుడు మాత్రం మరింత దూరం పెట్టినట్టే కనిపిస్తున్నారు. అలాగే కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న కేసీఆర్ ఆ మంత్రివర్గ విస్తరణలోనూ …. ఆయన్ను పక్కనపెట్టబోతున్నారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. హరీష్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదనే విషయాన్ని.. తన చేతల ద్వారా ఇప్పటి వరకూ.. సూచనలు పంపించారని. హరీష్‌ను మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికే.. ఈ ఆలస్యం అని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు కూడా.. ఈ విషయాన్ని ముందే పసిగట్టి తన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు చప్పుడు ఇప్పుడు పార్టీలో ఎక్కడా … పెద్దగా కనిపించడంలేదు. ఆయన కేవలం సిద్దిపేటలో మాత్రమే.. పర్యటిస్తున్నారు. ఇతర పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అంటే.. ఓ రకంగా.. హరీష్ రావు కూడా ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ కి వచ్చేసారు.

What Is Harish Rao Future In Trs Party..?-Congress Party Harish Jagga Reddy Comments Ktr No Minister Post

What Is Harish Rao Future In Trs Party..?

ఇక ఈ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం మళ్లీ ప్రారంభమయింది. అయితే.. ఇప్పుడు హరీష్‌కు మాత్రమే కాదు.. కేటీఆర్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వట్లేదు అనే సమాచారం ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది. అంతే కాకుండా… టీఆర్ఎస్ పార్టీ మీద… అధినేత కేసీఆర్ మీద అసంతృప్తితో హరీష్ రగిలిపోతున్నారని… అందుకే… ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలనీ చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ… కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అనేక సంచల విషయాలు బయటపెట్టాడు. హరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని, అందుకోసం కేవీపీతో రాయబారం కూడా నడిపారని సంచల ఆరోపణలు కూడా చేశారు. ఇవన్నీ ప్రస్తుతం పెద్ద రాజకీయ చర్చకు తెర లేపాయి.