అనుష్క మరింత స్లిమ్ గా మారుతోందా? అందుకే సినిమాలకు దూరంగా ఉందా? 

What Is Happening In Heroine Anushka Life

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అనుష్క.చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

 What Is Happening In Heroine Anushka Life-TeluguStop.com

బాహుబలితో కనీవినీ ఎరుగని విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ బొద్దుగుమ్మ.ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.ఆ తర్వాత వేరే సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 What Is Happening In Heroine Anushka Life-అనుష్క మరింత స్లిమ్ గా మారుతోందా అందుకే సినిమాలకు దూరంగా ఉందా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఆమె సినిమాలకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? అనే చర్చ జరుగుతోంది.అయితే ఆమె సినిమాల్లో నటించకపోవడానికి చాలా కారణాలు చెప్తున్నారు సినీ జనాలు.

సైజ్ జీరో సినిమా కోసం ఈ అమ్మడు ఓ రేంజిలో బరువు పెరిగింది.ఆ తర్వాత కొంత మేర తగ్గింది.

కానీ.అనుకున్నంత స్థాయిలో తగ్గలేదు.

ఇప్పటికీ ఈమెను అధిక బరువు సమస్య వేధిస్తుందట.దీంతో పాటు ఆమె వయసు కూడా 35 దాటిపోయింది.

దీంతో ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్నారట కుటుంబ సభ్యులు.

కారణాలు పక్కాగా తెలియక పోయినా.

అనుష్క మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఓ రేంజిలో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.

పాన్ ఇండియన్ హీరోయిన్ గా బాలీవుడ్ ను దున్నేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.కానీ ఈ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి.

ఉన్న ప్రాజెక్టుల ముచ్చట అటుంచితే.అసలు సినిమాలకే దూరంగా ఉంటుంది.

సైజ్ జీరో సినిమా అంటూ ఈ అమ్మడు అబ్ నార్మల్ గా బరువు పెరిగింది.కానీ తగ్గలేకపోతుంది.

ఎలాగైనా బరువు తగ్గాలనే ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.ప్రక్రుతి వైద్యం కూడా చేయించుకుంటుందట.

పూర్తిగా బరువు తగ్గే వరకు సినిమాలకు ఓకే చెప్పకూడదు అనుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.

Telugu Anushka, Bahubali, Heroine, Heroine Anushka, Size Zero, Tollywood, What Is Happening In Heroine Anushka Life-Telugu Stop Exclusive Top Stories

ఈ మధ్యే అనుష్కకు సంబంధించిన పలు ఫోటోలు విడుదల అయ్యాయి.న్యూ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది.కానీ అనుకున్నంత స్థాయిలో బరువు మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు.

కాస్త సన్నగా తయారైనా.గతంలో మాదిరిగా స్లిమ్ గా మారలేదు.

మరికొద్ది రోజుల్లోనే గతంలో కంటే మరింత స్లిమ్ గా తయారవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.త్వరలోనే అనుష్క నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.

గతంలో ఉన్న కొన్ని అగ్రిమెంట్లను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

#Bahubali #Size Zero #Anushka #Anushka #Anushka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube