17 ఏళ్ల క్రితం జరిగిందే మంచు విష్ణు విషయంలో జరగబోతుందా ?

మా అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.ఎత్తులకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నారు కంటెస్టెంట్లు.

 What Ia Going To Happen In Maa Manchu Vishnu Details, Manchu Vishnu, 17 Years Ba-TeluguStop.com

అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.అంతేకాదు.

ఒకరి ప్యానల్ పై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.

అంతేకాదు.ఫిర్యాదలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వాడీ వేడీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానెళ్లు.అందరిని కలుస్తూ తమదే విజయం అనేటట్లుగా దూసుకెళ్తున్నాయి.

వాస్తవానికి 1998 మా అసోషియేషన్ ఏర్పడింది.అక్కినేని నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు.హీరో కృష్ణ అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మొదలయ్యింది.అప్పుడు పోటీ లేకుండా ఎన్నికలు జరిగాయి.

కానీ ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి.మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.

అటు ఈ సారి మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీకి దిగాడు.సరిగ్గా 2004 అంటే 17 సంవత్సరాల క్రితం జరిగిన మా ఎన్నికల్లో మోహన్ బాబు అధ్యక్షుడి పోటీకి దిగాడు.

అప్పుడు ఎలాంటి పోటీ లేకుండా మొహన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

Telugu Maa, Manchu Vishnu, Manchuvishnu, Mohanu Babu, Artist, Krishna, Tollywood

మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు కుమారుడు విష్ణు బరిలోకి దిగాడు.అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నాడు.అయితే గతంలో మాదిరిగా ఈ సారి ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపించడం లేదు.

పోటా పోటీగా పోటీ ఉండే అవకాశం ఉంది.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఫ్యానెళ్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది.

మొత్తంగా మరో నాలుగు రోజుల్లో మా అసోషియేషన్ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది.ఈ ఎన్నికల్లో ఎవరి ప్యానెల్ విజయం సాధిస్తుందో అని జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

జనాలు కూడా మా ఎన్నికల ఫలితాల కోసం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube