ఇ–రూపీ అంటే ఏంటి? ఎక్కడ.. ఎలా వాడాలో తెలుసా?

ఇ–రూపీని ఇటీవలె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.దీన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ,నేషనల్‌ హెల్త్‌ మినిస్ట్రీ అథారిటీతో కలిసి రూపొందించింది.

 What Is Erupy How To Use It, Digital Payments, Narendra Modi, Qr Code, Erupy, Cr-TeluguStop.com

ఇ–రూపీ అంటే క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ బేస్డ్‌ వోచర్‌.దీన్ని లబ్ధిదారులకు మొబైల్‌ ద్వారా పొందుతారు.

దీనికి అతని వద్ద కూడా బెనిఫిషియరీస్‌ కార్డు ఉండవలసిన అవసరం లేదు.డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రెడీం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ వొచర్స్‌ను ఎస్‌ఎంఎస్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను షేర్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఇ–రూపీ.

క్రిప్టో కరెన్సీ ఒకటేనా?
క్రిప్టోకరెన్సీ, ఇ–రూపీ ఒకటి కాదు.రెండు ఒకే విధంగా పనిచేస్తాయి.
ఎవరు ఇ–రూపీ వాడతారు?
ఇ–రూపీ వొచర్స్‌ ఉన్నవారు సులభంగా వీటిని వాడుకోవచ్చని పీఎంఓ తెలిపింది.ఆషుష్మాన్‌ భారత్, ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన, ఫర్టిలైజర్‌ సబ్‌సిడీస్‌ ఇతర లబ్ధిదారులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు.
ఇ–రూపీని ఎక్కడ ఉపయోగించాలి?
ఇ–రూపీ వోచర్స్‌ ఆరోగ్య సంబంధిత చెల్లింపులకు కూడా ఉపయోగించవచ్చు.కార్పొరేట్‌ సంస్థలు కూడా వీటిని వాడవచ్చు.

అంటే వారి ఉద్యోగులకు కూడా వొచర్స్‌ను ఇవ్వచ్చు.
ఏ బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి?

Telugu Banks, Crypto Currnecy, App, Erupy, Icici, Indian, Narendra Modi, Qr-Late

ఎన్‌పీసీఐ వివరాల ప్రకారం ప్రస్తుతం ఇ–రూపీ ప్రత్యక్షంగా 11 బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాయి.
1.యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
2.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
3.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
4.కొటాక్‌ బ్యాంక్‌
5.ఇండియన్‌ బ్యాంక్‌
6.ఇండస్‌ఇండ్‌ బ్యాక్‌
7.ఐసీఐసీఐ
8.హెడీఎఫ్‌సీ
9.కెనరా బ్యాంక్‌
10.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
11.యాక్సిస్‌ బ్యాంక్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube