టీడీపీలో ఏంటి ఈ పరిస్థితి ..? బాబు పట్టు కోల్పోతున్నాడా...?  

What Is Chandrababu Naidu Position In Tdp-

క్రమశిక్షణకు మరు పేరు ఉన్న పార్టీ ఏడైనా ఉందా అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇక్కడ అధినేత చెప్పిందే ఫైనల్. ఎవరికీ టికెట్ ఇచ్చినా ఎవరికీ ప్రాధాన్యం ఇచ్చినా అదంతా టీడీపీ అధినేత కనుసన్నల్లో జరగాల్సిందే..

టీడీపీలో ఏంటి ఈ పరిస్థితి ..? బాబు పట్టు కోల్పోతున్నాడా...? -What Is Chandrababu Naidu Position In TDP

కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకులందరికీ ఇది వర్తిస్తుంది. మాట వినని నాయకులకు ఇక రాజకీయ భవిష్యేతే ఉండదేమో అన్నట్టుగా… ఆ పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. అయితే అదంతా ఒకప్పుడు మాత్రమే. ఇప్పుఇడు ఆ పరిస్థితి టీడీపీలో కనిపించడంలేదు.

పార్టీ కంటే వ్యక్తులే గొప్ప అన్నట్టుగా ఎవరికీ వారు ధిక్కార స్వరం పార్టీలో వినిపిస్తున్నారు.

ఈ విషయంలో చంద్రబాబు కూడా వారిని ఏమీ అనలేని పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు … ఇక టికెట్ల విషయానికి వస్తే…

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మంత్రి నారాయణ సిటీ నియోజకవర్గాన్ని కన్ఫామ్ చేసుకుంటే, తాజాగా మరో రెండుస్థానాల్లో మేమే బరిలో ఉన్నామంటూ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పేశారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి బొల్లినేని కృష్ణయ్య అభ్యర్థులమంటూ ప్రకటించేసుకున్నారు.

ఇటీవల స్థానికంగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకే వీరిలా మాట్లాడినా, ఇదే ఫైనల్ అని చెప్పడాన్ని బట్టిచూస్తే చంద్రబాబుకి వీరిచ్చే గౌరవం అర్థమౌతోంది. సాధారణంగా టీడీపీలో టికెట్ల వ్యవహారం చివరి నిమిషం వరకూ తేలే వ్యవహారంకాదు. అర్థరాత్రి వేళ ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు, తెల్లారేసరికి ఎవరికి టిక్కెట్టు ఇస్తారో ఎవరికీ అర్థంకాదు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడమే లేదు. క్రమ క్రమంగా పార్టీ మీద బాబు పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది.