పొత్తుల‌పై చంద్ర‌బాబు ఏం చేయ‌బోతున్నారు.. ట్రాక్ రికార్డులే చెబుతున్నాయా..?

పొత్తు వ్య‌వ‌హారం.ఇప్పుడు ఏపీలో చాలా రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

 What Is Chandrababu Going To Do About Alliances Are The Track Records Saying ,-TeluguStop.com

ముఖ్యంగా చంద్ర‌బాబు అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన త‌ర్వాత ఈ చ‌ర్చ బాగా హాట్ టాపిక్ అవుతోంది.చంద్ర‌బాబు ఇత‌ర పార్టీ నేత‌ల‌తో పొత్తులు పెట్టుకుంటార‌ని ముఖ్యంగా జ‌న‌సేన‌తో క‌లుస్తార‌నేది టీడీపీ త‌మ్ముళ్లు బ‌లంగా చేస్తున్న ప్ర‌చారం.

ఇక పొత్తుల మీద కూడా మొన్న చంద్ర‌బాబు ఓ క్లారిటీ ఇచ్చేశారు.కుప్పం వేదిక‌గా జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగానే ఉన్న‌ట్టు త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్ప‌క‌నే చెప్పేశారు.

అయితే త‌న‌కు ఒక్కిడికే ప్రేమ ఉంటే స‌రిపోద‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా ప్రేమ ఉండాల‌ని చెప్పారు.అంటే ప‌వ‌న్ ఒప్పుకుంటే తాను పొత్తుకు సిద్ధ‌మేనంటూ చంద్ర‌బాబు చెబుతున్నార‌న్న‌మాట‌.

కాగా ఈ క్ర‌మంలోనే ఓ వాద‌న వినిపిస్తోంది.అదేంటంటే.

పొత్తుల‌పై ఎవ‌రికీ పెద్ద‌గా సందేహాలు అక్క‌ర్లేద‌ని, చంద్ర‌బాబు ట్రాక్ రికార్డు చూస్తేనే పొత్తుల‌పై ఆయ‌న ఎజెండా ఏంటో అర్థం అవుతుంద‌ని చెబుతున్నారు.ఎందుకంటే గ‌తంలో పొత్తులు పెట్టుకునే అధికారంలోకి వ‌చ్చారు.

పైగా చంద్ర‌బాబు నాయుడు పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా వారిని క‌లుపుకుని పోతారు.

చంద్ర‌బాబు నాయుడు ఏ పార్టీని విభేదించినా స‌రే.త‌న‌కు అవ‌స‌రం అనుకుంటే మాత్రం ఆ పార్టీని క‌చ్చితంగా క‌లుపుకుని పోతారు.1999లో, 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.2009లో టీఆర్ఎస్, కమ్యునిస్టుల‌తో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు.గెలుపు మాత్రం ద‌క్క‌లేదు.

అయినా స‌రే 2014లో మ‌ళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.కాబ‌ట్టి గెలుపు ద‌క్కని ప్ర‌తిసారి ఆయ‌న ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకుంటారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు కాబ‌ట్టి.ఈ సారి పొత్తుల‌తోనే ముందుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు చంద్ర‌బాబు.

మ‌రి బీజేపీ, జ‌న‌సేన‌లు ఏం చేస్తాయ‌న్న‌ది వేచి చూడాలి.

What Is Chandrababu Going To Do About Alliances Are The Track Records Saying , Chandrababu, Tdp , Janasena - Telugu Chandrababu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube