బొడ్డులో ఈ తెల్లని స్పాంజ్ లాంటి పదార్థం ఎప్పుడైనా గమనించారా.? అసలు అదేంటి.? ఎందుకు పేరుకుంటుంది.?     2018-10-19   11:37:12  IST  Sai Mallula

బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం. కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్న, అంద విహీనంగా ఉన్న, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. అయితే బొడ్డులో అప్పుడప్పుడు తెల్లని పొరలాగా స్పాంజ్ టైపు లో ఓ లేయర్ ఏర్పడుతూ ఉంటుంది. అది చాలా మంది స్నానం చేసేటప్పుడు చూసే ఉంటారు. కానీ అది ఏంటి.? ఎలా ఏర్పడుతుంది.? అలా ఏర్పడడం మంచిదేనా కాదా.? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఆ తెల్లని ఫైబర్ పదార్తాన్ని ఇంగ్లీష్ లో “లింట్” అంటారు.

చర్మంపై ఉండే డెడ్‌స్కిన్ సెల్స్, వెంట్రుకల్లో ఉండే ఫైబర్ లాంటి పదార్థం, దుస్తుల నుంచి ఏర్పడే సన్నని పోగులు వంటివన్నీ కలిసి బొడ్డులో వ్యర్థ పదార్థం (‘లింట్’)గా ఏర్పడతాయని గతంలో తెలుసుకున్నాం కదా! ఇది చూసేందుకు మెత్తగా కాటన్‌లా ఉంటుంది కూడా. అయితే అది అలా ఎందుకు ఏర్పడుతుందో తెలుసా? ఈ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

బొడ్డులో లింట్ ఎందుకు ఏర్పడుతుందనే దానిపై ఆస్ట్రియాకు చెందిన జార్జ్ స్టెయిన్‌హాజర్ అనే ఓ కెమిస్ట్ పరిశోధనలు చేసి చివరకు ఓ విషయం తెలుసుకున్నాడు. ఇందు కోసం అతను తన సొంత బొడ్డునే ప్రయోగకేంద్రంగా చేసుకున్నాడు. అలా 3 ఏళ్ల పాటు తన బొడ్డులో ఏర్పడ్డ లింట్‌ను పెద్ద మొత్తంలో సేకరించిన జార్జ్ అందులోని దాదాపు 503 రకాల పీస్‌లపై ప్రయోగాలు చేశాడు. చివరకు ఏం తెలిసిందంటే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే వివిధ రకాల వ్యర్థాలను సేకరించి వాటిని బొడ్డులోకి పంపుతాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును, ఇది నిజమే.

అయితే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే ఎందుకు ఇలా చేస్తాయోనని అతను కనిపెట్టకలేకపోయాడు. కాకపోతే కొంత మంది వ్యక్తుల లింట్‌లో చెమట, డస్ట్, ఫ్యాట్ కణాలు కూడా ఉంటాయట. ఆయా వ్యక్తుల శరీరాలను బట్టి లింట్ మారుతూ ఉంటుందట. బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలు సహజంగానే బొడ్డు వైపుకు వచ్చేలా ఉంటాయట. ఈ క్రమంలోనే అవి ఆ వ్యర్థాలను బొడ్డులోకి పంపుతాయని జార్జ్ ప్రయోగం గురించి తెలుసుకున్న పలువురు సైంటిస్టులు భావిస్తున్నారు.

మరి బొడ్డులో ‘లింట్’ పేరుకుపోకుండా చూడలేమా? అంటే, చూడవచ్చు. అదెలా ఉంటే బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలను తీసేస్తే లింట్ చేరదు. కానీ వెంట్రుకలు మళ్లీ పెరిగితే లింట్ తిరిగి వస్తుంది. పోగులు ఎక్కువ రాని దుస్తులు వేసుకున్నా లింట్ చేరదట. అంతేకాకుండా బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నా లింట్ వచ్చి చేరేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట. ఇది అంత ప్రమాదకరం కాదు, కానీ లింట్ ఎక్కువగా పేర్కొనిపోవడం వల్ల అప్పుడప్పుడు విపరీతమైన బొడ్డు నొప్పి వస్తుంది. సో ఆ లింట్ ను స్నానం చేసే టైమ్ లో క్లీన్ చేసుకుంటే మంచిది. తెలుసుకున్నారుగా, ‘లింట్’ గురించిన ఆసక్తికర విషయాలను! మీకు ఈ సమాచారం నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయడం మరిచిపోకండే!