ఏపీ ఆర్టీసీ బస్సుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేస్తున్నారంటే.. ?

కరోనా వల్ల దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్దలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.అందులో రెండు రాష్ట్రాల ఆర్టీసి సంస్దలు తీవ్రమైన నష్ట, కష్టాల్లో కూరుకు పోతున్నాయి.

 What Is Being Done To Prevent The Spread Of Corona Virus In Ap Rtc-TeluguStop.com

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో రోడ్ల మీదే తిరిగే బస్సుల్లోని ప్రయాణికులు ఎంతకని కరోనా రక్షణ చర్యలు తీసుకుంటారు.

ఎంత తీసుకున్నా కోవిడ్ సోకే వారికి సోకుతూనే ఉంది.

 What Is Being Done To Prevent The Spread Of Corona Virus In Ap Rtc-ఏపీ ఆర్టీసీ బస్సుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేస్తున్నారంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగని పూర్తిగా బస్సులను బంద్ చేస్తే ప్రయాణికులతో పాటుగా, ఆర్టీసీ సంస్ద కూడా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది.ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించినట్లుగా ఉంది ఏపీఎస్ ఆర్టీసీ.

అందుకే ఓ కీలక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలని, 50 శాతం సీట్లకే ప్రయాణికులను పరిమితం చేయాలని నిర్ణయించింది.

అదీగాక ముందస్తు రిజర్వేషన్‌ సగం సీట్లకే చేసుకునేలా మార్పులు చేసింది.ఇకపోతే ఆయా డిపోలకు ఈ నిబంధన తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాలు జారీ చేశారు.

#Corona Virus #Spread #RTC Buses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు