సూచనా చౌదరి అరెస్ట్ కాబోతున్నాడా ..? బాబు సైలెంట్ అందుకేనా ..?  

కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ .. మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన అనేక ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు కేసులు నమోదు చేసుకుని సమన్లు కూడా పంపారు. అయితే ఈ విషయం పై ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. కానీ ఈ వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు. దీంతో ఆయన వరసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సుజనాకు చెందిన కంపెనీలు అప్పుగా తీసుకున్నాయి. వ్యాపారంలో నష్టాలని ఆ సొమ్ములను ఎగవేశారు. ఆ కంపెనీలే డొల్ల కంపెనీలు అని లోన్ల కోసమే వాటిని పుట్టించినట్టుగా ఈడీ నిర్ధారించింది.

What Is Behind The Telugu Desam Party Silent In Sujana Chowdhary Case-

What Is Behind The Telugu Desam Party Silent In Sujana Chowdhary Case

అయితే సుజనా చౌదరి వ్యవహారంలో ముందు టీడీపీ ..ఆ పార్టీ అనుకూల మీడియా గట్టిగా స్పందించింది. అయితే ఈ వ్యవహారం రోజు రోజుకు బిగిసే ఛాన్స్ కనిపించడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చౌదరిని ఈడీ అరెస్టు చేయవచ్చని చంద్రబాబు కు కూడా తెలిసిందని.. అందుకే బాబు ఇప్పుడు కామ్ గా ఉన్నాడని, చౌదరి గురించి మాట్లాడితే ఆ వ్యవహారం తమకు చుట్టుకుంటుందని తెలుగుదేశం నేతలు కూడా మౌనం వహిస్తున్నారని పార్టీలోనే గుజగుసలు వినిపిస్తున్నాయి.