ఇకపై టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయితే..?!

తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో నిర్ణయాన్ని తీసుకొని వాహనదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ సంబంధించిన పరిస్థితులకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇదివరకే భారతదేశంలో ఉన్న రహదారులపై ఉండే 770 టోల్ ప్లాజా లలో ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం మార్చి 1 వరకు ఫ్రీ ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రకటించింది.దీనివల్ల టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.నేషనల్ హైవే లో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకమైన రంగుతో ఓ ప్రత్యేకమైన లైన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు రోడ్డు, రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఎప్పుడైనా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తిరిగినట్లయితే ఓ నిర్దిష్ట సమయంలో అన్ని వాహనాల కోసం వెళ్లేందుకు ఆ కొత్త రకమైన లైన్ గేట్ పూర్తిగా తెరవాల్సి ఉంటుంది.

Telugu Toll, Fastag, March, Jam, Control-Latest News - Telugu

తాజాగా ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఫాస్ట్ వినియోగించే వారి సంఖ్య ఏకంగా 90 శాతానికి చేరుకోవడంతో రోడ్డు రవాణా శాఖకు పెద్ద ఎత్తున ఖజానా నిండుతోంది.దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఈ విధానం ద్వారా 63 లక్షల లావాదేవీలతో ఏకంగా 100 కోట్ల పైగా టోల్ రుసుమును వసూలు చేసింది.వీటితో పాటు తాజాగా కొత్తగా 25 లక్షలకు పైగా కొత్త టోల్ సేల్స్ జరిపినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది.

ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం నిరీక్షించు కుండా ఉండేందుకు వీలుగా రోడ్డు రవాణా శాఖ కొత్త నిబంధన ప్రకారం ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేయనున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube