ఈసారి ఒలంపిక్స్ లో ఎంట్రీ అవుతున్న క్రీడలేవంటే..?!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఈవెంట్ అయిన ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.టోక్యోలో ఒలింపిక్స్‌ మరో వారం రోజుల్లో మొదలవ్వనున్నాయి.

 What If The Sport Is Entering The Olympics This Time ..?! Tokyo Olympics 2021, S-TeluguStop.com

గత సంవత్సరం నిర్వహించాల్సినటువంటి ఈ ఆటలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.జులై 23 నుంచి ఈ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

ఒలింపిక్స్ కు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు హాజరుకానున్నారు.ఇందులో మొదటిసారిగా కొంత మంది టోక్యోకు ప్రయాణం కానున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి కొన్ని ఆటలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.మొత్తం ఆరు క్రీడలను టోక్యో ఒలింపిక్స్‌ లో కొత్తగా చేర్చారు.

ఇందులో రెండు గతంలో ఎగ్జిబిషన్ ఈవెంట్లుగా ఆడించినా ఏవో కారణాలతో వాటిని ఆపేశారు.మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌ 2021లో పతకం సాధించే ఈవెంట్లలో ఈ ఆటలను చేర్చారు.టోక్యో ఒలింపిక్స్‌ లో ఈసారి కనిపించే ఆటల్లో ప్రధానమైంది బేస్‌బాల్‌ కూడా ఉంది.1992లో ఇది మెడల్ ఈవెంట్ గానే ఒలింపిక్స్‌లో ఉండేది.అయితే దీనిని 2008లో ఒలింపిక్స్ నుంచి తొలగించేశారు.జపాన్‌ లో ఈ ఆట బాగా పాపులర్ అయ్యింది కూడా.

Telugu Games, Latest, Soft Balls, Ups, Tokyo Olym-Latest News - Telugu

ప్రతీ సంవత్సరం జపాన్‌ లో జరిగే నిప్పన్ ప్రొఫెషనల్ బేస్‌ బాల్ లీగ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆటగా పేరు సాధించింది.ఈ ఆటలో 6 దేశాలు తలపడనున్నాయి.మహిళల కోసం కూడా ఈ ఆటను ఒలింపిక్స్ లో చేర్చడం జరిగింది.మహిళలు ఆడనున్న బేస్‌ బాల్‌ ను సాఫ్ట్ బాల్ పేరుతో పిలవననున్నట్లు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌ లో మొదటిసారి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో ఆట స్కేట్ బోర్డింగ్ ఆట అని చెప్పొచ్చు.మహిళలు, పురుషుల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

పార్క్, స్ట్రీట్ రెండింటిలో మెడల్స్ ఇవ్వనున్నారు.అలాగే సర్ఫింగ్‌ ని కూడా టోక్యో ఒలింపిక్స్‌ లో చేర్చారు.

ఇకనుంచి ఈ క్రీడలను ఒలింపిక్స్‌ లో ఆడించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్వాహాక కమిటీ పేర్కొంది.రాక్ క్లైంబింగ్‌ ను కూడా తొలిసారి ఒలింపిక్స్‌ లో ప్రవేశ పెట్టారు.

ఇక మరో ముఖ్యమైన ఆట కరాటేను కూడా ఈ సంవత్సరంలో ఒలింపిక్స్‌ లో చేర్చడం జరిగింది.బాస్కెట్‌ బాల్‌ ను కూడా మొదటిసారిగా టోక్యో ఒలింపిక్స్‌ లో చేర్చడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube