శాకుంతలం పోయిందంటే గుణశేఖర్ పరిస్థితి ఏమిటి?

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే చిత్రాలు ఎంతటి భారీ స్థాయిలో ఉంటాయో అందరకీ తెలిసిందే.ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ రుద్రమదేవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 What If Shakuntalam Fails At Box Office-TeluguStop.com

అయితే ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని ప్రారంభించేందుకు గుణశేఖర్ చాలా సమయం తీసుకున్నాడు.తాజాగా శాకుంతలం అనే సినిమాను తెరకెక్కించేందుకు గుణశేఖర్ రెడీ అయ్యాడు.

ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినా, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు.

ఇక ఈ సినిమాలో లీడ్ రోల్‌లో స్టార్ బ్యూటీ సమంత నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా కథ దాదాపు అందరికీ తెలియడంతోనే ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.శకుంతల-దుశ్యంతుల ప్రేమకథ గురించి దాదాపు అందరికీ తెలిసిందే.వారి మధ్య ప్రేమను ఓ రేంజ్‌లో చూపిస్తేనే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు.అయితే ఇప్పటికే పెళ్లయిన సమంత ఇలాంటి ఘాటు రొమాంటిక్ సీన్స్‌లో ఎలా నటిస్తుందా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఏదేమైనా సమంత ఈ సినిమాలో రొమాన్స్‌ను పండించడంలో ఏమాత్రం వెనకాడినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇదే జరిగితే భారీ వ్యయంతో రాబోయే ఈ సినిమా ఫ్లాప్ మూవీగా నిలవడం ఖాయమని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా గుణశేఖర్ ఈ సినిమాను ప్రెజెంట్ చేయాలని చూస్తున్న గుణశేఖర్ ఈ సినిమా ఫెయిల్ అయితే ఆయన పరిస్థితి ఏమిటా అనేది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుంది.ఏదేమైనా శాకుంతలం చిత్రానికి సమంత పర్ఫెక్ట్ ఎంపిక కాదని చాలా మంది పెదవి విరుస్తున్న మాట వాస్తవం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube