లవ్‌స్టోరి హిట్ అయితే ఓకే.. మరి తేడా కొడితే?

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఆయన సినిమా వస్తుందంటే కొందరు ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు పరుగులు తీస్తారు.

 What If Love Story Gets Poor Response, Love Story, Naga Chaitanya, Sai Pallavi,-TeluguStop.com

అంతలా ఆయన కథలతో మెస్మరైజ్ చేసే శేఖర్ కమ్ముల తన లాస్ట్ మూవీ ‘ఫిదా’తో ఎలాంటి సక్సెస్ కొట్టాడో అందరికీ తెలిసిందే.అందాల భామ సాయి పల్లవి, వరుణ్ తేజ్‌లు జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’తో మరోసారి అలాంటి ఫీట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్.

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పక్కా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శేఖర్ కమ్ముల తీర్చిదిద్దాడు.

దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ అనుకున్నదానికంటే చాలా ఆలస్యం అవుతుండటం ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద శాపంగా మారిందని చెప్పాలి.

ఓ సినిమా వస్తుందంటే కొంతకాలం వరకు ఆ సినిమాపై క్రేజ్ ఉంటుంది.కానీ మరీ ఆలస్యం అవుతూ వస్తే, ఆ సినిమాపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతుందని ఈ లవ్ స్టోరి చిత్రం మనకు రుజువు చేస్తోంది.

పలుమార్లు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ వచ్చినా, మళ్లీమళ్లీ వాయిదా వేస్తూ వచ్చారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ప్రేక్షకులు అంటున్నారు.

అయితే ఈ క్రమంలో సెప్టెంబర్ 24న రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘లవ్ స్టోరి’ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఒకవేళ ఈ సినిమా కంటెంట్ పరంగా బాగుంటే ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారు.

కానీ ఏమాత్రం తేడా కొట్టినా లవ్ స్టోరి చిత్రాన్ని పట్టించుకునే వారు ఎవరూ ఉండరని సినీ క్రిటిక్స్ హెచ్చరిస్తున్నారు.ఇన్నిసార్లు వాయిదా పడ్డ సినిమాలో మ్యాటర్ లేకపోతే ప్రేక్షకులు కూడా ఏమీ చేయలేరని వారు అంటున్నారు.

మరి నిజంగా లవ్‌స్టోరి చిత్రాన్ని ఇన్నిసార్లు వాయిదా వేయడంలో చిత్ర యూనిట్ ఉద్దేశ్యం ఏమిటో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube