కేసీఆర్‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురైతే ఎలా..?

What If Kcr Had Such An Experience

అదేంటో గానీ కేసీఆర్‌కు ఇప్పుడు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి.ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చిన వారే చివ‌ర‌కు ఆయ‌న‌కు షాక్ ఇస్తున్నారు.

 What If Kcr Had Such An Experience-TeluguStop.com

మొన్న‌టికి మొన్న రైతు ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన రెండు మూడు రోజుల‌కే రాకేష్ టికాయ‌త్ హైదరాబాద్ వ‌చ్చి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు గుప్పించారు.దీంతో ఆయ‌న ప్లాన్ కాస్తా రివ‌ర్స్ అయిపోయింది.

ఇక వ‌డ్ల కొనుగోలు విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీని క‌లిసి ప్ర‌శ్నిస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ క‌నీసం ఆయ‌న్ను క‌ల‌వ‌కుండానే తిరిగి రావ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశం అయిపోయింది.

 What If Kcr Had Such An Experience-కేసీఆర్‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురైతే ఎలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందుకు వారు చెబుతున్న కార‌ణాలు ఏంటంటే న‌రేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌ని.

ఇక దీన్ని లోక‌ల్ బీజేపీ లీడ‌ర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.అదేంటి బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి అపాయింట్ మెంట్ ఇచ్చిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీ కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వ‌రంటూ అడుగుతున్నారు.

అస‌లు టీఆర్ ఎస్ వారు అపాయింట్ మెంట్ కోర‌లేద‌ని చెబుతున్నారు.ఇక ఇదిలా ఉంచితే ఈ సీన్ కేసీఆర్ తీరును చూపిస్తోంది.

ఆయ‌న కూడా ఎవ‌రికీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌ర‌ని, సొంత మంత్రుల‌కే అపాయింట్ మెంట్ ఉండ‌దంటూ ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Telugu Pmnarendramodi, Bandi Sanjay, Bjp, Farmmers, Harish Rao, Paddy, Trs, Ts Potics-Telugu Political News

కాబ‌ట్టి సొంత పార్టీ నేత‌ల‌కు అపాయిట్ మెంట్ ఇవ్వ‌కుండా ఉంచితే ఎలాంటి వేధ‌న క‌లుగుతుందో ఇప్పుడు కేసీఆర్ కు కూడా అలాంటిదే క‌లుగుతోంద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.అయితే కేసీఆర్ సీఎం మాత్ర‌మే అని ఆయ‌నే అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా బిజీగా ఉంటే.మ‌రి దేశాన్ని ఏలుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇంకేంత బిజీగా ఉండాలంటూ కూడా కొన్ని ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఏదేమైనా కూడా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించే తీరు వ‌ల్ల బాధ‌ప‌డే వారి వేద‌న ఇప్పుడు కేసీఆర్ కు ఎదురైందంటూ చెబుతున్నారు.ఫ్రీగా ఉన్న కేసీఆరే సొంత ప్రభుత్వంలోని మంత్రులకే టైం ఇవ్వని వేళ, తనకు మించిన స్థాయిలో ఉన్న మోడీ లాంటి ప్రధాని.

తాను కోరుకున్నంతనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారని కేసీఆర్ ఎలా అనుకుంటారు.ఏమైనా.అందరికి తాను చూపించే అనుభవాన్ని మోడీ ఆయనకు చూపించిన వేళ కేసీఆర్ ఫీలింగ్స్ ఏమిటన్న విషయం మీద క్లారిటీ రావాలంటే.ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిందే.

అప్పుడు మాత్రమే.గులాబీ బాస్ ఫీలింగ్స్ బయటకు వచ్చే ఛాన్సుంది.

#Harish Rao #Farmmers #Bjp #Bandi Sanjay #PMNarendraModi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube