ఇంట్లో దేవుడికి దీపం పెట్టె సమయం లేకపోతే ఏమి చేయాలి?  

  • సాధారణంగా ప్రతి రోజు ఇంటిలో దీపం వెలిగిస్తే ఆ ఇల్లు ఐశ్వర్యం, సంతోషాలతో ఉంటుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఈ రోజుల్లో బిజీ జీవనశైలి కారణంగా చాలా మందికి దీపం వెలిగించటానికి సమయం ఉండటం లేదు.అలాంటి సమయంలో ఏమి చేయాలి. అంటే దానికి ఒక మార్గం ఉంది. దీపం వెలిగించటానికి సమయం లేనప్పుడు అగరవత్తు వెలిగించి ఇల్లు అంతా ఆ ధూపాన్ని చూపించాలి.

  • కొంత మందికి ఉదయం దీపం వేలించటానికి మరియు అగరవత్తు వెలిగించటానికి కూడా సమయం ఉండదు. అలాంటి వాళ్ళు సాయంత్రం సమయంలోనైనా పెట్టవచ్చు. సాయంత్రం కూడా కుదరకపోతే రాత్రి సమయంలోనైనా పెట్టవచ్చు. ఇలాగా కుదరని వాళ్ళు దేవుడి గదిలో దూప్ స్టిక్ వెలిగించిన సరిపోతుంది. దీపం పెట్టలేనప్పుడు వినాయకుణ్ణి స్మరించి శుక్లాం బరధరం అనే శ్లోకాన్ని పఠిస్తే కొంత వరకు అయినా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందవచ్చు.