ఢీ అక్సాఖాన్ సంపాదన ఎంతో తెలిస్తే?

ఢీ అక్సాఖాన్ ఢీ జోడీ డ్యాన్స్ షోలో తన డ్యాన్స్ తో కుర్రకారు మతిపోగొడుతూ స్టార్ సెలెబ్రెటీగా ఎదిగిన విషయం తెలిసిందే.ఇలా సాయిపల్లవి కూడా సాధారణ డ్యాన్సర్ నుండి ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో మనం చూశాం.

 What If Dhee Aksakhan's Earnings Are Well Known Aqsa Khan Dancer Aqsa Khan,dee J-TeluguStop.com

అలా ఇప్పుడు డ్యాన్సర్ అక్సాఖాన్ కూడా ఢీ జోడీతో పెద్ద సెలెబ్రెటీగా మారిపోవడంతో ఇప్పుడు హీరోయిన్ గా తన సత్తాను చాటేందుకు సిద్దమైంది.ఇలా ఇప్పుడు సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ఎటువంటి సినిమాతో అక్సాఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదన్నదనేది సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

అక్సాఖాన్ డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్ బేస్డ్ మూవీతో ముందుకొస్తుందా లేక ఒక క్యూట్ లవ్ స్టోరీతో ముందుకొస్తుందా అనేది అక్సాఖాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు బయటికి వస్తే మనకు తెలిసే అవకాశం ఉంది.అంతేకాక స్టార్ స్టేటస్ గా మారిన హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు.

అలా అక్సాఖాన్ కూడా వాళ్ళ బాటలోనే అడుగులు వేస్తోంది.ప్రస్తుతం అక్సాఖాన్ సంపాదన విషయానికి వస్తే ఒక్క షో కి లక్ష రూపాయలు తీసుకుంటుండగా, హీరోయిన్ గా దాదాపు 25 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube