దత్తత గ్రామాలకి ఏం చేసావ్ మహేష్ బాబు.?

శ్రీమంతుడు సినిమా హిట్ అయిన తరవాత తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంత గ్రామాన్ని(బుర్రిపాలెం) దత్తత తీసుకున్న మహేష్ బాబు , తెలంగాణా లో కూడా సిద్దాపురం అనే ఊరుని దత్తత తీసుకున్నాడు.అచ్చం శ్రీమంతుడు సినిమా లో లాగానే ఆయన ఈ దత్తత కార్యక్రమం మొదలు పెట్టాడు.

 What Has Mahesh Done To Adopted Villages?-TeluguStop.com

ఆ గ్రామాలు సస్యస్యామలం అయ్యే దిశగా అభివృద్ధి చేస్తాను అని మాట ఇచ్చాడు మహేష్.

అయితే బుర్రిపాలెం విషయం మహేష్ పట్టించుకోవడం లేదు అని చాన్నాళ్ళ నుంచీ మీడియా చెబుతోంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని శిద్ధాపురం గ్రామాన్ని కూడా మర్చిపోయాడని తాజా వార్త.తెలంగాణ ఐటీ అండ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరిక మేరకు హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శిద్ధాపురాన్ని మహేష్‌ దత్తత తీసుకున్నాడు.

ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని అందరికీ చెప్పన మహేష్ బాబు ఆ సినిమా సమయంలో ఈ విషయం మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా పొందాడు.తరవాత నెమ్మదిగా ఆ గ్రామాన్నీ మరచిపోయాడు.

సెప్టెంబర్ 28 న దత్తత విషయం ప్రకటించగానే శ్రీమంతుడు సినిమా లెవెల్లో అక్కడ ఎదో జరుగుతుంది అని ఆశించిన జనాలు ఇప్పుడు డీలా పడ్డారు.గ్రామంలో 720 కుటుంబాలున్నాయి.జనాభా 3,400.అందరూ కాయకష్టం చేసుకొని బతికేవారే.ప్రభుత్వాలు ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు.ఇన్నాళ్లకు ‘శ్రీమంతుడు’ దయ వల్ల గ్రామం బాగుపడుతుందని అనుకున్నారు.

కాని ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉంది.ఇక్కడ మౌలిక వసతులు లేవు.తాగునీటి కొరత ఉంది.ఆస్పత్రికి వెళ్లాలంటే పాతిక కిలోమీటర్లు పోవాలి.

చాలా కష్టాలతో ప్రస్తుతం ఆ గ్రామం ఇబ్బందుల్లో ఉంది, మరి దత్తత తీసుకున్న మహేష్ గారు ఫోటోలకి ఫోజులు ఇవ్వడం తప్ప ఏమైనా చేసారా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం.మహేష్ లాంటి సూపర్ స్టార్ దత్తత తీసుకున్నాక అధికారులు కూడా ఆ ఊరు సంగతి పట్టించుకోవడం లేదట పాపం.

సినిమాల్లోనే హడావిడి తప్ప బయట హీరోలు నిజమైన హీరోలు కాదు అని ఈ విధంగా నిరూపణ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు .ఇప్పటికైనా మహేష్ మేల్కొని ఆ గ్రామాలని కాస్త పట్టించుకుంటే బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube