రెండున్న‌రేండ్ల‌లో జ‌గ‌న్ సాధించిందేంటి.. న‌ష్ట‌పోయిందేంటి..?

అంద‌రూ ఎదురు చూస్తున్న త‌రుణం రానే వ‌చ్చేస్తోంది.అదే జ‌గ‌న్ పాల‌న‌కు రెండున్న‌రేండ్లు.

 What Has Jagan Achieved In Both The Rands  What Has He Lost Agan, Ycp-TeluguStop.com

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఇది ఎంతో కీల‌క‌మైన అంశం అనే చెప్పాలి.ఎందుకంటే ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి స‌రిగ్గా రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్నాయి.

ఈ స‌గం కాలం పాల‌న‌లో ఆయ‌న సాధించిందేంటి.కోల్పోయిందేంటి అనే అంశాల‌ను ఓ సారి బేరీజు వేస్తే.

ముందుగా గుర్తుకు వ‌చ్చేది సంక్షేమ పథకాల అమ‌లు.వీటి ద్వారా జ‌గ‌న్‌కు ఇంకా ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కొన‌సాగుతోంది.ఇదే ఆయ‌న‌కు కొండంత బ‌లాన్నిఇస్తోంది.

ప్ర‌జ‌ల‌కు పింఛ‌న్లు, ఇండ్ల ప‌ట్టాలు అంద‌జేయ‌డం ఆయ‌న‌కు బాగా పేరు తీసుకువ‌చ్చింది. వలంటీర్ వ్యవస్థ జ‌గ‌న్‌కు ఎంతో పేరు తీసుకువ‌చ్చింది.నాడు-నేడు తో పాటుగా అమ్మ ఒడి లాంటి స్కీములు ఆయ‌న‌కు మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి.

మ‌రి ఇదే స‌మ‌యంలో ఆయ‌న కోల్పోయింది ఏంటి అనే విష‌యానికి వ‌స్తే మాత్రం అప్పులు, రాజధాని ఉద్యమం, సామాజిక ప‌ర‌మైన వ్య‌తిరేక‌త బాగా వినిపించింద‌నే చెప్పాలి.ఎక్కువ‌గా ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయ‌డంతో ఇది కాస్తా జ‌గ‌న్‌కు వ్య‌తిరేక‌త తీసుకు వ‌చ్చింద‌నే చెప్పాలి.

Telugu Ap, Chnadrababu, Jagan, Jaganachieved, Ysrcp-Political

ఇక మొన్న మూడు రాజ‌ధానుల విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌డం పెద్ద మైన‌స్‌.అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు సామాజిక వ‌ర్గం అయిన కమ్మ వర్గం మీద జ‌గ‌న్ దూకుడు ఆయ‌న మీద తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది.అలాగే డాక్టర్ సుధాకర్ ఘటన తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌ను తీసుకు వ‌చ్చింది.అటు కోర్టుల్లో కూడా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు కొట్టివేయ‌డం లాంటి ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి.

ఇక ప్రత్యేకహోదా విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌డం అతి పెద్ద మైన‌స్‌.ఇలా లాభాల‌కంటే న‌ష్టాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

మ‌రి జ‌గ‌న్ పాల‌న మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube