ఒంట్లో ప్రొటీన్ తక్కువైతే ఎన్ని ప్రమాదాలో!  

What Happens When Your Body Lacks Enough Protein?-

ప్రొటీన్ ఎందుకు అవసరమో, ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారం ఏదో మనం ఇప్పటికే చదవుకోని ఉంటాం.రక్తం, ఎముకలు, హార్మోన్స్ .ఇలా చెప్పుకుంటూ పోతే శరీరంలోని చాలా విభాగాలు సరిగా పనిచేయాలంటే ప్రొటీన్స్ అవసరం.మరి ప్రోటీన్‌లు శరీరానికి తక్కువగా అందితే ఏమవుతుంది?* ప్రోటీన్‌లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెడతాయి.ప్రోటీన్‌ల శాతం తక్కువ అవుతున్నా కొద్ది, షుగర్ లెవెల్స్ శాతం పెరిగిపోతూ ఉంటుంది..

What Happens When Your Body Lacks Enough Protein?---

* కండరాలు బలాన్ని కొల్పోతాయి.మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, బాడి బిల్డింగ్ చేసేవారు కండరాలు గట్టిపడాలనే ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటారు.అందుకే ప్రోటీన్‌లు అందకపోతే కండరాలు వీక్ గా ఉంటాయి.

* ప్రోటీన్‌లు తక్కువగా అందితే, మతిమరుపు రావడం, విషయాల్ని సరిగా గ్రహించకపోవడం జరుగుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి.* ప్రోటీన్‌లు తక్కువగా అందుతున్నకొద్దీ, రోగనిరోధకశక్తి తగ్గతూ ఉంటుంది.అలాంటప్పుడు చిన్న చిన్న ఇంఫెక్షన్స్ ని కూడా తట్టుకోలేదు శరీరం.

ఇక ఏదైనా పెద్ద సమస్య వస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.* కొంచెం విచిత్రంగా అనిపించినా, ప్రోటీన్‌లు తక్కువైతే ఆకలి బాగా వేస్తుంది, అలాగే ఊరికే అలసిపోతారు.మొత్తానికి జీవక్రియ దెబ్బతింటుంది.

* శరీరం ఉబ్బిపోతుంది.అది ముఖం కావచ్చు, చేతులు కావచ్చు.ప్రొటీన్ తక్కువైతే శరీరంలో నీరు అలానే ఉండిపోతుంది.

* ప్రోటీన్‌లు తక్కువైతే హార్మోనుల సమతుల్యత దెబ్బతింటుంది.ముఖ్యంగా నిద్రను మోసుకొచ్చే హార్మోన్స్ సరిగా సీక్రేట్ కావు.దాంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి.