గర్భిణీ స్త్రీలకు డయాబెటిస్ వస్తే ఏం అవుతుంది?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.వారు తీసుకునే ఆహార విషయంలో కానీ, చేసే పనులలో ఆచితూచి అడుగులువేస్తూ ఉంటారు.

 What Happens To Pregnant Women With Diabetes-TeluguStop.com

వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుని కచ్చితంగా ఆ డైట్ ను ఫాలో అవుతుంటారు.గర్భధారణ సమయంలో కొందరిలో వాంతులు, వికారం వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి.

వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా వారి శరీరానికి పడవు.అలాంటప్పుడు శిశువు పెరుగుదల లోపం ఏర్పడుతుంది.

 What Happens To Pregnant Women With Diabetes-గర్భిణీ స్త్రీలకు డయాబెటిస్ వస్తే ఏం అవుతుంది-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరికొందరిలో గర్భం ధరించినప్పుడు వారు మధుమేహానికి గురవుతుంటారు.దీనినే జెస్టేషనల్‌ డయాబెటిస్ అని అంటారు.

గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు అవుతుండటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి.అయితే ఈ డయాబెటిస్ ను నియంత్రించడానికి సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా నియంత్రించవచ్చు.

పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ గల ఆహార పదార్థాలను తీసుకోవాలి.అన్నం తక్కువగా తిని, కూరలు అధిక మోతాదులో తీసుకోవాలి.

ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఒకేసారి తినకుండా కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభించే పదార్థాలను తీసుకోవాలి.

డయాబెటిస్ తో బాధపడేవారు వారి ఆహారంలో కొద్దిరోజుల పాటు చక్కెర, స్వీట్లు మొదలైన తీపి పదార్థాలను మానేయడం ఎంతో మంచిది.

ఈ సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి.

అంతేకాకుండా గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు కూడా పెద్ద సమస్యగా మారుతుంది.వీలైనంతవరకూ తరుచు రక్తపోటును, రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ ఉండాలి.రాత్రి పడుకునే ముందు మజ్జిగ తాగడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట పాటు నడవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం.

#Diabetes #Pregnant Women #BeforeSleeping #Vegetables #HighBlood

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు