ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూస్తున్నారా.. అయితే రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం!- What Happens Looking At The Phone Early In The Morning

what happens looking at the phone early in the morning? looking phone, morning, latest news, health tips, health, good health, effects of phones, smart phones, phones - Telugu Effects Of Phones, Good Health, Health, Health Tips, Latest News, Looking Phone, Morning, Phones, Smart Phones

నేటి ఆధునిక కాలంలో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు.సోష‌ల్ మీడియా యాప్స్‌, గేమింగ్ యాప్స్ రాక‌తో స్మార్ట్ ఫోన్ వినియోగం మ‌రింత పెరిగింది.

 What Happens Looking At The Phone Early In The Morning-TeluguStop.com

రోజులో స‌గానికి పైగా స‌మయాన్ని ఫోన్‌లోనే గ‌డుపుతున్న వారు చాలా మంది ఉన్నారు.ఇక నిద్రించే స‌మ‌యంలోనూ ఫోన్‌ను వ‌దిలి పెట్ట‌డం లేదు.

అలాగే ఉద‌యం లేవ‌గానే కూడా ఫోన్ చూస్తూనే రోజును ప్రారంభిస్తున్నారు.నిద్ర లేవ‌గానే ట‌క్కున ఫోన్ ప‌ట్టుకుని.

 What Happens Looking At The Phone Early In The Morning-ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూస్తున్నారా.. అయితే రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏం ఏం మెసేజ్‌లు వ‌చ్చాయి, ఎవ‌రు కాల్ చేశారు ఇలాంటివి చెక్ చేసుకునే అల‌వాటు చాలా మంది ఉంటుంది.
కానీ, ఇక్క‌డ చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.

ఉద‌యం నిద్ర‌ లేవ‌గానే ఫోన్ చూడ‌టం చాలా ప్ర‌మాదమ‌ని, అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు నిపుణులు.ఎందుకూ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల‌.అప్ప‌టి వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న కళ్లపై ఒక్కసారిగా ఎక్కువ కాంతి పడుతుంది.

ఇలా ఒక‌టి రెండు రోజులు జ‌రిగితే.ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు.

కానీ, ప్ర‌తి రోజు ఇలానే జ‌రిగి.కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తిని.

చూపు మంద‌గించ‌డం ప్రారంభం అవుతుంది.

అలాగే ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.అదెలా అంటే.సాధార‌ణంగా మ‌న‌కు వ‌చ్చే మెసేజ్‌లు మంచివి అవ్వొచ్చు.

మ‌రియు చెడ్డ‌వి అవ్వొచ్చు.ఒక వేళ చెడ్డ‌వి అయితే.

ఉద‌యం వాటిని చూడ‌గానే మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌టంతో పాటు ర‌క్త‌పోటు పెర‌గ‌డ‌మో.త‌గ్గిపోవ‌డ‌మో జ‌రుగుతుంది.

అంతేకాదు, ఈ మెసేజ్‌ల గురించే రోజంతా ఆలోచిస్తే. ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.
ఇక ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల‌.అందులోని వెలుతురు నుండి వచ్చే కిరణాలు క‌ళ్ల‌లోకి నేరుగా ప‌డుతాయి.ఇదే అల‌వాటు అయితే.మైగ్రేన్ స‌మ‌స్య‌కు దారి తీస్తుంది.

అందువ‌ల్ల‌, ఉద‌యం లేవ‌గానే ఫోన్లు చూడ‌టం మానేసి.సూర్యోదయాన్ని చూస్తూ.

ఇష్ట‌మైన పాట‌లు వింటూ.మొక్కలకు నీరు పోస్తూ గడిపితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది.

#Smart Phones #Good Health #Health #Phones #Looking Phone

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు