జనసేనలో ఏం జరుగుతోంది...? ఆ కోటరీ నాయకులు రాజీనామా చేస్తారా ..?  

జననసేన పార్టీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించేలా …. ప్రధాన రాజకీయ పార్టీలను కంగారు పెట్టేలా ముందుకు వెళ్తోంది. కొత్త కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తూ …. వీలైయితే ఏపీలో అధికారం దక్కించుకోవాలని… అలా కుదరకపోతే ఏదైనా ప్రధాన పార్టీతో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే సమయం మించిపోవడం… ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్న తరుణంలో పార్టీలో చేరికలపై ప్రధానంగా ద్రుష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగానే ఆర్ధిక స్థితిమంతులు… విద్యావేత్తలు… తటస్థులను పార్టీలో చేర్చుకుని మైలేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉండగానే… ఇప్పుడు పవన్ సొంత సామజిక వర్గానికి చెందిన కోటరీ నాయకులు పవన్ తీరుపై అసహనంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు.

What Happens In Pawan Kalyan Janasena Party-Janasena Party Kotari Pawan Tdp Ycp Ys Jagan

What Happens In Pawan Kalyan Janasena Party

ఈ అసంతృప్తి మరీ ముదిరి పార్టీకి రాజీనామా చేసేవరకు వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి లోతుగా పరిశీలన చేస్తే…. జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా హెచ్చరిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి ట్రెజరర్ గా వ్యవహరిస్తున్న ఈయన ఆశిస్తున్న సీటు విషయంలో పార్టీలో వేరే వర్గం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందట అందుకే.. ఈ విధంగా బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఆయన కాకినాడ లోక్ సభ స్థానానికి పోటీ చేయాలనేది మారిశెట్టి రాఘవయ్య ప్రణాళిక. ఈ మేరకు ఆయన జనసేనలో పనిచేస్తూ వస్తున్నారు. దాదాపు ఇదే సీటు కోసం ముందు నుంచి కర్చీఫ్ వేసుకుని ఉన్నారు.

What Happens In Pawan Kalyan Janasena Party-Janasena Party Kotari Pawan Tdp Ycp Ys Jagan

అయితే ఆయన ఆశలు నిరసలు చేసేలా ఈ సీటుపై చిక్కాల తాతాజీ అనే వ్యక్తిని తెరమీదకు తీసుకొస్తున్నారు మరో వర్గం నాయకులు. అయితే ఈ విషయంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న రాఘవయ్య ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్తే పెద్దగా పట్టించుకోలేదట. దీంతో మరింత అసహనానికి గురయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా… పార్టీలో జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న ముత్తంశెట్టి కృష్ణారావు కూడా ఈ విధంగానే అసహనంతో ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన కొంతమంది నాయకులు పవన్ ని తప్పుదారి పట్టిస్తూ… పార్టీకి చేటు తెస్తున్నారని ఇలా అయితే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను అధిష్టానం బుజ్జగిస్తోందో లేక అలా చూసీ చూడనట్టుగా వదిలేస్తుందో చూడాలి.