హెల్మెట్ పెట్టుకుని లాక్ వేయకపోతే ఏమి జరుగుతుందంటే..?!

What Happens If You Dont Lock Your Helmet After Wearing

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని ప్రతి రోజు మనం ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాము.అయినాగానీ కొంతమంది మాత్రం హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు.

 What Happens If You Dont Lock Your Helmet After Wearing-TeluguStop.com

మరికొందరు అయితే ఈ హెల్మెట్‍ను తమ ప్రాణాలకు రక్షణగా కాకుండా ఏదో పోలీసులు ఫైన్ వేస్తారనో, మధ్యలో ఆపేస్తారనే భయంతోనే ఏదో నామకార్థం  గా తలకు తగిలించుకుంటున్నారు తప్పా ప్రమాదాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.మరికొందరు అయితే హెల్మెట్ ఉండాలని భావించి మార్కెట్లో దొరికే నాసిరకం హెల్మెట్ ను కొనుక్కుని వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఒకవేళ తలకు హెల్మెట్ ధరించినాగాని దానికి లాక్ వేయడం లేదు.అలా లాక్ వేయకపోతే ఇంకా హెల్మెట్ పెట్టుకుని ఏమి ఉపయోగం చెప్పండి.

 What Happens If You Dont Lock Your Helmet After Wearing-హెల్మెట్ పెట్టుకుని లాక్ వేయకపోతే ఏమి జరుగుతుందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లాక్ వేసుకోకపోతే హెల్మెట్ ఊడిపోతుంది.దీంతో తలకు బలమైన గాయాలై ప్రాణాలు విడుస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో జరిగింది అసలు వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టినాగులపల్లి, కోకాపేట ఔటర్ సర్వీస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.గుంటూరు జిల్లా ఆకులవారితోట గ్రామానికి చెందిన ఆకాశపు శ్రీనివాస్ అనే వ్యక్తి బేగంపేట్ లోని వీ కోలాబ్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, సనత్ నగర్ బీ-3 ప్లాట్ లో నివాసముంటున్నాడు.

కాగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విధులు ముగించుకొని తన పల్సర్ వాహనంపై శంకర్ పల్లి, మొఖిల గ్రామానికి చెందిన తన స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు.

Telugu Helmet, Hyderabad, Kokapetaouter, Latest, Lock, Locked Helmet, Road, Safety, Tipper-Latest News - Telugu

ఈ క్రమంలోనే కోకాపేట ఔటర్ సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే వేగంగా వస్తున్న టిప్పర్ ఒకటి శ్రీనివాస్ ప్రయాణిస్తున్న పల్సర్ బండిని ఢీకొంది.అంతే ఒక్కసారిగా శ్రీనివాస్ బైక్ పైనుంచి ఎగిరి కిందపడ్డాడు.ఈ క్రమంలోనే అతను పెట్టుకున్న హెల్మెట్ గాల్లోనే కిందపడిపోయింది.

ఎందుకంటే శ్రీనివాస్ హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ దానికి లాక్ వేయలేదు.దీంతో ఆ హెల్మెట్ గాల్లోనే ఊడిపోయింది.

శ్రీనివాస్ రోడ్డుపై కింద పడడంతో తలకు బలమైన గాయలై అక్కడిక్కడే మృతి చెందాడు.శ్రీనివాస్ గనుక హెల్మెట్ కి లాక్ పెట్టుకొని ఉంటే స్వల్ప గాయాలతో బయటపడేవాడని పోలీసులు చెబుతున్నారు.

ఇకనుండైనా హెల్మెట్ పెట్టుకుని లాక్ వేసుకోవడం మర్చిపోవద్దు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

#Helmet #Kokapeta Outer #Locked Helmet #Road #Safety

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube