శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు మన దగ్గర ఉండవచ్చా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తారు.అయితే ఈ సాంప్రదాయాల తో పాటు ఎంతో మంది కొన్ని మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా విశ్వసిస్తారు.

 What Happens If We Keep Dead Persons Material At Home Dead Person Photo Frame, D-TeluguStop.com

ఈ క్రమంలోనే మన ఇంట్లో ఎంతో అమితంగా ప్రేమించే వారు మరణించినట్లయితే వారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును ఎంతో జాగ్రత్తగా వారి ప్రేమకు గుర్తుగా వాటిని భద్రపరచుకుంటాము.అయితే కొందరు మాత్రం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు అని నమ్ముతారు.

మరి నిజంగానే చనిపోయిన వారి వస్తువులు మన ఇంట్లో ఉండకూడదా ఉంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే.

శాస్త్రం ప్రకారం నలభై ఐదు సంవత్సరాలకు లోపల ఉన్నవారు మరణించినట్లయితే పొరపాటున కూడా వారి జాతకాన్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు.

వీరు ఎన్నో తీరని కోరికలతో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే అలాంటి వారి జాతకాలను పారుతున్న నీటిలో వదిలివేయాలి.అదే విధంగా వారికి సంబంధించిన బట్టలను ఇతరులు ధరించకూడదు.ఇలా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులలో వారికి ఏది ఇష్టమో తెలియదు కనుక వాటన్నింటినీ బయట పడేయటం వల్ల మనకు ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Telugu Person Dream, Person Material, Person Frame-Telugu Bhakthi

అలాగే చనిపోయిన వారి బంగారు నగలను చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు అయితే వారికి గుర్తుగా ఉన్న నగలను ఇంట్లో పెట్టుకోకూడదు వాటిని అమ్మి కొత్త నగలను చేయించుకోవడం మంచిది.అయితే కొందరు మాత్రం ఇలాంటి నమ్మకాలను పట్టించుకోకుండా చనిపోయిన వారి ప్రేమను చూపిస్తూ వారు ఉపయోగించే వస్తువులను ఉపయోగించి వాటిని వారికి గుర్తుగా ఇంట్లో పెట్టుకోవడం మనం చూస్తుంటాము.ఎవరి నమ్మకం వారిది.

అయితే కొన్ని విషయాలు మనసు చంపుకొని పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube