గుడ్డులోని పచ్చసొన తిన‌కూడ‌దా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

What Happens If We Eat Egg Yellow

సంపూర్ణ ఆహారం అయిన `గుడ్డు` ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ప్ర‌తి ఒక్క‌రిని రోజుకు క‌నీసం ఒక గుడ్డు అయినా తీసుకోమ‌ని చెబుతుంటారు.

 What Happens If We Eat Egg Yellow-TeluguStop.com

అయితే గుడ్డులోని ప‌చ్చ‌సొన తిన‌వ‌చ్చా.? తిన‌కూడ‌దా.? అస‌లు తింటే ఏం అవుతుంది.? తిన‌క‌పోతే ఏం అవుతుంది.? ఇలాంటి ప్ర‌శ్న‌లు చ‌లా మంది మ‌దిలో ఉన్నాయి.కానీ, చాలా మంది గుడ్డులోని ప‌చ్చ‌సొన తింటే ఆరోగ్యానికి మంచికాదు అని, అందులో కొలెస్ట్రాల్‌ ఎక్కువ‌గా ఉంటుంది.

కాబ‌ట్టి, అది తిన‌డం వ‌ల్ల కొవ్వు పెరుగిపోతుంది అని ఫిక్స్ అయిపోయి దాన్ని తిన‌డం మానేస్తున్నారు.

 What Happens If We Eat Egg Yellow-గుడ్డులోని పచ్చసొన తిన‌కూడ‌దా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల సంపూర్ణ ఆహారం అయిన గుడ్డు నుంచి స‌గం పోష‌కాల‌ను మీరు వ‌దిలేసుకున్న‌ట్టే అవుతుంది.

ఎందుకంటే, గుడ్డులోని ప‌చ్చ‌సొన‌లో కూడా ఎన్నో విటమిన్లు, మినిరల్స్ శరీరానికి అవసరయ్యే కొవ్వులు ఉంటాయి.ఇక గుడ్డులోని ప‌చ్చ‌సొన‌లో కొల‌స్ట్రాల్ ఉన్న‌ప్ప‌టికీ.

అది ర‌క్తంలో కొవ్వును పెంచ‌ద‌ని ఎన్నో అధ్య‌య‌నాలు తేల్చి చెప్పారు.

అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే విట‌మిన్ ఎ, ఎముకులను బ‌లంగా మార్చే విట‌మిన్ కె, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే విట‌మిన్ ఇ, రోగాల బారిన ప‌డ‌కుండా చూసే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే విట‌మిన్ డి గుడ్డులోని ప‌చ్చ‌సోనలో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతాయి.అంతేనా అంటే కాదండోయ్‌.బి5, బి6, బి12 విట‌మిన్ల‌తో పాటు జింక్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖ‌నీజాలు కూడా గుడ్డు ప‌చ్చ‌సోన‌లో ఉంటాయి.

అలాగే ఇనుము పుష్క‌లంగా ఉండే ప‌చ్చ‌సోన తీసుకోవ‌డం వ‌ల్ల.దాన్ని మ‌న శ‌రీరం సులువుగా గ్ర‌హిస్తుంది.అలాగే ఉడికించిన గుడ్డు ప‌చ్చ‌సొన తీయ‌కుండా తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌తో పాటు, ఊబకాయం, ర‌క్త‌పోటు ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సో.గుడ్డులోని ప‌చ్చ‌సొన తీసేసి తింటే.పైన చెప్పుకున్న ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఎదిగే పిల్ల‌లు, గర్భిణులు ఖ‌చ్చితంగా గుడ్డులోని ప‌చ్చసొన తీసుకోవాలి.అప్పుడే వారికి అన్ని పోష‌కాలు అందుతాయి.

ఆరోగ్యంగా ఉంటారు.

#Tips #Egg Yellow #Egg Yellow

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube