సెలవు దొరికితే ఎక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే ప్రమాదమే

మీకు సాధారణంగా రోజూ ఏ సమయంలో మెలుకువ అవుతుంది? కొందరికి ఉదయం 5-6 గంటల మధ్య, కొందరికి 7-8, కొందరికి 8-9 గంటల మధ్య.ఈ సమయాన్ని దాటి కూడా నిద్రపోతే మీరు చేతిలో ఏం పనిలేక ఖాలిగా ఉన్నారని అర్థం.

 What Happens If There Is No Consistent Sleep Time-TeluguStop.com

ఖాలిగా అంటే గుర్తొచ్చింది, సెలవులు దొరికితే మనలో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు.సాధారణంగా యవ్వనంలో ఉండేవారు, సెలవు దొరికితే మధ్యాహ్నం సమయంలో నిద్ర లేస్తుంటారు.ఇది మంచి అలవాటేనా?

ముమ్మాటికి కాదు.7-8 గంటల నిద్ర శరీరానికి ఎలాగైతే అవసరమో .రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం కూడా చాలా అవసరం.ఓరోజు త్వరగా పడుకోని, త్వరగా లేచి, మరోరోజు లేటుగా పడుకోని లేటుగా లేవడం సరైన పద్ధతి కాదు.

ఖచ్చితమైన పరిస్థితులలో తప్పిస్తే, ఎప్పుడూ ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.

అలా కాకుండా, శరీరం అలవాటుపడిన సమయాల్ని బ్రేక్ చేస్తే నిద్రలేమి సమస్యలు మొదలవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

కాబట్టి సెలవుల్లో అతిగా నిద్రపోకూడదు.శరీరానికి ఒకే రకమైన నిద్రను అలవాటు చేయాలి.

అప్పుడే మన శరీరం మన మాట వింటుంది.రోజూవారి నిద్ర సమయాల్ని బ్రేక్ చేస్తే నిద్రలేమి సమస్య ఒక్కటే కాదు, బద్ధకం, అలసత్వం వంటి సమస్యలు కుడా కొనితెచ్చుకున్నవారవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube