తులసి మొక్కకు పచ్చిపాలతో ఆరాధిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.

 What Happens If The Basil Plant Is Adored With Raw Milk-TeluguStop.com

తులసి మొక్కను కేవలం దైవ సమానంగా భావించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఔషధ మొక్కగా కూడా భావిస్తారు.ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజలు చేస్తుంటారు.

ఈ విధంగా తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని, వ్యాపారాలలో బాగా అభివృద్ధి సాధిస్తారని చెబుతారు.

 What Happens If The Basil Plant Is Adored With Raw Milk-తులసి మొక్కకు పచ్చిపాలతో ఆరాధిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన ఇంట్లో పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు ఎన్ని రోజులకు పెళ్లి సంబంధాలు కుదరకపోతే ఈ రోజు తులసి చెట్టుకు పూజలు చేయటం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు కూడా తెలిసి మొక్కను ఆరాధించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.మన ఇంటి ఆవరణంలో ఎప్పుడూ కూడా తులసి మొక్కను ఆగ్నేయ దిశలో పెట్టాలి.

Telugu Basil, Basil Plant, Hindhu Samprdayam, Pooja, Raw Milk, Thulasi Pooja-Telugu Bhakthi

వ్యాపార రంగంలో ఉండే వారు వారికి వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆరాధించాలి.అదేవిధంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనేవారు తులసి మొక్కకు పచ్చి పాలు, స్వీట్లతో పూజ చేయాలి.ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాపారంలో ముందుకు సాగుతారు.ఈ విధంగా తులసి మొక్కకు నైవేద్యంగా సమర్పించిన పాలు స్వీట్లు మిగిలితే వాటిని వివాహిత స్త్రీకి దానం చేయడం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని.

అదే విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్యలతో సతమత మవుతున్నప్పుడు ఒక ఐదు తులసి ఆకులను ఇత్తడి నీటి కుండలో వేసి 24 గంటల తర్వాత ఆ నీటిని ఇంటి బయట, ఇంటి లోపల చల్లుకుంటే మన ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

#Raw Milk #Pooja #Basil #Thulasi Pooja #Basil Plant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL