గ‌ర్భిణీలు ఉపవాసం చేయొచ్చా..? అసలు చేస్తే ఏం అవుతుంది..?

ద‌స‌రా పండ‌గ రాబోతోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ‌గ‌ను ఎంతో ప్ర‌త్యేకంగా చేసుకుంటారు.

 What Happens If Fasting During Pregnancy Pregnancy, Fasting, Women, Latest News,-TeluguStop.com

ద‌స‌రాకు ముందు నవరాత్రులు అంటే తొమ్మ‌ది రోజుల పాటు ఆ దుర్గా దేవిని ఒక్కో అవతారంలో పూజిస్తారు.అలాగే స్త్రీలు ఈ తొమ్మిది రోజులు ఉప‌వాసం ఉంటూ అమ్మ‌వారిని నియ‌మ నిష్ట‌ల‌తో కొలుస్తారు.

అయితే కొంద‌రు గ‌ర్భిణీ స్త్రీలు కూడా ఉప‌వాసం చేసేందుకు మ‌క్కువ చూపుతుంటారు.మ‌రి గ‌ర్భిణీలు ఉప‌వాసం చేయొచ్చా.? అస‌లు గ‌ర్భిణీలు ఉప‌వాసం చేస్తే ఏం అవుతుంది.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా మామూలు స‌మ‌యంతో పోలిస్తే.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో కేరింగ్‌గా ఉండాలి.అందులోనూ ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే గున‌క‌.ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఇలాంటి వారు ఉప‌వాసం జోలికి అస్స‌లు వెల్ల‌కూడ‌దు.ఒక‌వేళ వెళ్తే.

ఆ ప్ర‌భావం త‌ల్లిపైనే కాదు, క‌డుపులోని బిడ్డ మీదా ప‌డుతుంది.

అలాగే ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల బలహీనంగా మారిపోవ‌డం, తీవ్రమైన త‌ల నొప్పి, అధిక అల‌స‌ట‌, క‌ళ్లు తిర‌గ‌డం, ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌డం వంటివి కూడా జ‌రుగుతాయి.

అందుకే ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న గ‌ర్భిణీ స్త్రీలు ఉప‌వాసం చేయ‌రాదు.

అదే ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా ఫుల్ హెల్తీగా ఉన్న‌ గ‌ర్భిణీ స్త్రీలు అయితే ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉప‌వాసం చేయ వ‌చ్చు.ఇటువంటి వారు ఉపవాస సమయంలో శరీరానికి శక్తిని ఇవ్వడానికి తాజా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.వాట‌ర్ అధికంగా సేవించాలి.మజ్జిగ, పాలు కొబ్బ‌రి నీళ్లు వంటివి త‌ర‌చూ సేవించాలి.త‌ద్వారా శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది.మ‌రియు నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక వీటితో పాటు ఉప‌వాసం చేసే గ‌ర్భిణీలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube