ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా పుచ్చకాయలే కనివిందు చేస్తుంటాయి.
వేసవి తాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయలు రుచిగా ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.అందుకే పుచ్చకాయలను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే కొందరు పుచ్చకాయ తినేటప్పుడు అందులో ఉండే గింజల్ని కూడా తినేస్తుంటారు.
కొందరు మాత్రం అరగవని, కడుపు నొప్పి వస్తుందని చెప్పి గింజలను తేసేసి తింటుంటారు.
మరి ఇంతకీ పుచ్చకాయతో గింజలు కూడా కలిపి తినొచ్చా తినకూడదా అంటే ఆరోగ్య నిపుణులు ఎలాంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా ఎంచక్కా తినొచ్చని చెబుతుంటారు.ఎందుకంటే, పుచ్చ కాయలోనే కాదు గింజల్లోనూ విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఐరన్, జింక్, పాస్ఫరస్, కాపర్, థయామిన్, నియాసిన్, ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స ఇలా ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు దాగి ఉంటాయి.
అందుకే పుచ్చకాయతో గింజలు కూడా కలిపి తినేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గుతుందని భావించే వారు పుచ్చ కాయతో గింజలను కూడా కలిపి తీసుకుంటే మెదడు పని తీరు మెరుగు పడుతుంది.
దాంతో జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.అలాగే సంతాన లేమితో సమస్యతో బాధ పడే దంపతులు పుచ్చకాయతో గింజలను కూడా తింటే చాలా మంచిది.
పుచ్చ గింజల్లో ఉండే పలు పోషకాలు స్త్రీలో గర్భాశయ సమస్యలను దూరం చేస్తాయి.మరియు మగవారిలో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి.మధుమేహం వ్యాధి ఉన్న వారు పుచ్చకాయతో గింజలను కూడా తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఇక పుచ్చకాయతో గింజలను కూడా కలిపి తీసుకుంటే చర్మంపై వచ్చే ముడతలు దూరం అవుతుంది.