పాలిచ్చే త‌ల్లులు క్యాబేజీ తింటే ఏం అవుతుందో తెలుసా?

సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తీసుకునే ఆహారం విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తారో.ప్ర‌స‌వం త‌ర్వాత కూడా ఎన్నో ఆహార నియ‌మాలు పాటిస్తారు.

 What Happens If Breastfeeding Moms Eat Cabbage-TeluguStop.com

ప్ర‌స‌వం త‌ర్వాత బిడ్డ‌కు త‌ల్లి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది.అందువ‌ల్ల‌, బిడ్డ‌కు మంచి పోష‌కాలు అందాలంటే.

త‌ల్లి ఖ‌చ్చితంగా పోష‌కాహారం తీసుకోవాలి.అలాగే బిడ్డ పెరిగే కొద్ది.

 What Happens If Breastfeeding Moms Eat Cabbage-పాలిచ్చే త‌ల్లులు క్యాబేజీ తింటే ఏం అవుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారికి ఎక్కువ పాలు అవ‌స‌రం.అయితే త‌ల్లి తీసుకునే ఆహారంపైనే పాల ఉత్ప‌త్తి కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

అందుకే, పాలు ప‌డే ఆహారాలు తీసుకోమ‌ని పెద్ద‌లు, వైద్యులు త‌ర‌చూ చెబుతుంటారు.

అయితే పాలు ఉత్ప‌త్తి పెంచే ఆహారాల్లో క్యాబేజీ కూడా ఒక‌టి.

సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది క్యాబేజీని తినేందుకు ఇష్ట ప‌డ‌రు.కానీ, క్యాబేజీలో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి.

విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బీటా కెరోటిన్, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు క్యాబేజీలో దాగి ఉంటాయి.అందువ‌ల్ల, క్యాబేజీని డైట్‌లో చేర్చుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా బ్రెష్ట్ ఫీడ్ చేసే మ‌హిళ‌లు త‌మ డైట్‌లో క్యాబేజీ ఉండేలా చూసుకోవాలి.ఇలా చేస్తే పాలు ఉత్ప‌త్తి పెరుగుతుంది.మ‌రియు త‌ల్లికి, బిడ్డ‌కు ఎన్నో పోష‌కాలు కూడా అందుతాయి.అలాగే ప్ర‌స‌వ‌తం త‌ర్వాత బ‌రువు త‌గ్గేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే బ‌రువు త‌గ్గించ‌డంలోనూ క్యాబేజీ ఉప‌యోగ‌ప‌డుతుంది.క్యాబేజీలో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

Telugu Baby Health, Benefits Of Cabbage, Breastfeeding, Breastfeeding Moms, Cabbage, Eat Cabbage, Good Health, Health, Health Tips, Latest News, Mothers-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అందువ‌ల్ల, క్యాబేజీ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.అయితే మంచిది క‌దా అని క్యాబేజీని పాలిచ్చే త‌ల్లులు అతిగా మాత్రం తీసుకోరాదు.కేవ‌లం వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.లేదంటే ఒళ్లు నొప్పులు మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.ఇక క్యాబేజీ ఉడికించి తీసుకోవాలి.మ‌రియు క్యాబేజీని వండుకునే ముందు ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

#Good Health #Health Tips #Baby Health #Breastfeeding #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు