ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రెగ్యులర్‌గా తీసుకునే కామన్ ఆహారాల్లో వైట్ రైస్(తెల్ల బియ్యంతో చేసిన అన్నం) ఒకటి.వైట్ రైస్‌లో కర్రీ, రసం, పెరుగు ఇలా దీన్ని కలిపి తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇక తెల్ల బియ్యం యొక్క ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది.అందుకే తెల్ల బియ్యాన్నే ఎక్కువగా వాడతారు.
ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం తెల్ల బియ్యంతో చేసిన అన్నమే.
అయితే ఆరోగ్యానికి ఈ అన్నం మంచిదని కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అందుకు కారణం లేకపోలేదు.మార్కెట్‌లో తెల్ల బియాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు.
ఈ ప్రాసెసింగ్ కారణంగా బియ్యంలో ఉండే పోషక విలువలన్నీ తగ్గిపోతాయి.పైగా ఈ బియ్యంలో కేలరీలు అధిక శాతంలో ఉంటాయి.
అందుకే తెల్ల బియ్యాన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచదని సూచిస్తుంటారు.
అయితే రెగ్యులర్‌గా తినే వైట్ రైస్‌ను ఒక్క సారిగా దూరం పెట్టేస్తే ఏం అవుతుందో తెలుసా మంచే జరుగుతుంది.
అవును, వైట్ రైస్‌ను తినకపోవడం వల్ల మీ శరీరంలో ఎన్నో అద్భుమైన మార్పులు సంభవిస్తాయి.మరి ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.వైట్ రైస్ తినే వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అధిక బరువు.కార్పొహైడ్రేట్స్ మరియు కేలరీలు వైట్ రైస్‌లో ఎక్కువగా ఉంటాయి.
అందుకే బరువు పెరుగుతారు.అయితే వైట్ రైస్ తినడం మానేస్తే ఖచ్చితంగా మీ శరీర బరువు తగ్గుతుంది.
అలాగే వైట్ రైస్‌ను దూరం పెట్టడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా పెరుగుపడుతుంది.మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అంతేకాదు, వైట్ రైస్‌ను తినడం మానేస్తే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.ఒత్తిడి, అలసట, కండరాల నొప్పులు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
కాబట్టి, ఇకవై వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాస్ రైస్ వంటివి తీసుకోండి.
ఎందుకంటే, వైట్ రైస్‌తో పోలిస్తే వీటిల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కేలరీలు తక్కువగా ఉంటాయి.