కీళ్ల నొప్పుల స‌మ‌యంలో ట‌మాటా తింటే అంతే సంగ‌తులు.. జాగ్ర‌త్త‌?

ఎప్పుడో అర‌వై ఏళ్ల త‌ర్వాత వ‌చ్చే కీళ్ల నొప్పులు రావ‌డం స‌ర్వ సాధార‌ణ విష‌యం.వయసు పైబడిన కొద్దీ కీళ్లు అరిగి నొప్పులు పుడ‌తాయి.

 What Happens Eating Tomatoes When Joint Pain-TeluguStop.com

అయితే నేటి కాలంలో ముప్పై, న‌ల‌బై ఏళ్ల‌కే కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల లోపం, హార్మోన్ల అసమతుల్యత ఇలా ర‌క‌ర‌కాల కారాణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు ఏర్ప‌డుతున్నాయి.

దీంతో వాటిని త‌గ్గించుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.అయితే కీళ్ల నొప్పుల‌తో బాధపడే వారు మంచి పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి.

 What Happens Eating Tomatoes When Joint Pain-కీళ్ల నొప్పుల స‌మ‌యంలో ట‌మాటా తింటే అంతే సంగ‌తులు.. జాగ్ర‌త్త‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే కొన్ని కొన్ని ఆహారాల‌కు దూరంగా కూడా ఉంటాయి.ఎందుకంటే, ఆ ఆహారాలు కీళ్ల నొప్పిల‌ను రెట్టింపు చేస్తాయి.అలాంటి వాటిలో ట‌మాటాలు ముందుంటాయి.ట‌మాటాలు ఆరోగ్యానికి మంచిదే.

అయిన‌ప్ప‌టికీ కీళ్ల నొప్పులు ఉన్న వారు వీటికి దూరంగా ఉండాలి.ట‌మాటాల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఇది కీళ్ల నొప్పిల‌ను మ‌రింత అధికం చేస్తుంది.అంతేకాదు, కాళ్ల వాపుకు కూడా కారణం అవుతుంది.

అలాగే నేటి కాలంలో మ‌ద్యం అల‌వాటు ఉన్న వారు ఎంద‌రో ఉన్నారు.అయితే బీర్ వంటి వాటిలో యూరిడ్ యాసిడ్ అధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు మ‌ద్యం జోలుకు వెళ్లక‌పోవ‌డ‌మే చాలా మంచిద‌ని అంటున్నారు.ఇక రెడ్ మీట్‌కు కూడా కీళ్ల నొప్పులు ఉన్న వారు దూరంగా ఉండాలి.

రెడ్ మీట్‌లో నైట్రిట్స్, ప్యూరిన్స్, కెల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఇవి కీళ్ల నొప్పుల‌ను ఎక్కువ చేయ‌డంలో పాటు ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందే శ‌క్తిని కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది.

వీటితో పాటుగా పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం, మైదా పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలు వంటి వాటిని కూడా కీళ్ల నొప్పులు ఉన్న వారు ఎవైడ్ చేయ‌డ‌మే మంచిదంటున్నారు.

#BenefitsOf #Joint Pains #EffectsOf #Health Tips #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు