మ‌ధుమేహం రోగులు యాపిల్‌‌ తినొచ్చా.. తిన‌కూడ‌దా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ధుమేహం ఒక‌టి.మ‌ధుమేహాన్ని డ‌యాబెటిస్ లేదా షుగ‌ర్ వ్యాధి అని కూడా పిలుస్తుంటారు.

 What Happens Diabetes Patients Eat Apple-TeluguStop.com

శరీరంలో ఉండే షుగ‌ర్ లెవ‌ల్స్‌ హెచ్చు తగ్గుల వల్ల మ‌ధుమేహం వ‌స్తుంటుంది.మ‌ధుమేహం ఒక‌సారి వ‌చ్చిందంటే జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య.

ఈ స‌మ‌స్య‌కు మందులు మరియు చికిత్సలు ఉన్నాయి.కానీ అవి మన శరీరంలో ఉండే షుగర్‌ని సమతుల్యంగా ఉంచడానికి మాత్రమే పనిచేస్తాయి.

 What Happens Diabetes Patients Eat Apple-మ‌ధుమేహం రోగులు యాపిల్‌‌ తినొచ్చా.. తిన‌కూడ‌దా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రో విష‌యం ఏంటంటే.అర‌వై, డ‌బ్బై ఏళ్ల‌కు వ‌చ్చే ఈ మధుమేహం స‌మ‌స్య నేటి అధునిక కాలంలో కేవ‌లం ముప్పై ఏళ్ల‌కే వ‌స్తుంది.ఇక డ‌మాబెటిస్ వ‌చ్చాక ఎన్నో జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఆహార విష‌యంలో ఖ‌చ్చితంగా ప‌లు నియ‌మాలు పాటించాలి.

కొన్ని కొన్ని ఆహారాల‌కు దూరం కూడా ఉండాలి.అయితే మ‌ధుమేహం ఉన్న వారు పండ్ల‌నుతిన‌డానికినిరాక‌రిస్తుంటారు.

ముఖ్యంగా యాపిల్‌ను కొంద‌రు అస్స‌లు తిన‌రు.యాపిల్ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయ‌న్న భ‌య‌మే అందుకు కార‌ణం.ఇంత‌కీ మ‌ధుమేహం ఉన్న వారు యాపిల్‌ తినొచ్చా.తిన‌కూడ‌దా? అంటే ఆరోగ్య నిపుణులు ఎలాంటి భ‌యం లేకుండా తినొచ్చ‌ని చెబుతున్నారు.ప్ర‌తి రోజు ఒక యాపిల్ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ఏ మాత్రం పెర‌గ‌వ‌ని.అతిగా తింటేనే స‌మ‌స్య‌ని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే యాపిల్‌ను బెర్రీస్, ద్రాక్ష పండ్లతో క‌లిపి తీసుకుంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అదుపులో ఉంటాయ‌ని అంటున్నారు.

కాబ‌ట్టి, నిర్భ‌యంగా మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోండి.డ‌యాబెటిస్ రోగులే కాదు.

సాధార‌ణ వ్య‌క్తులు కూడా యాపిల్ తీసుకోవాలి.యాపిల్‌లో ఉండే బోలెడు పోష‌కాలు.

ర‌క్త‌హీన‌త‌, క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు, ర‌క్త‌పోటు, అధిక బ‌రువు ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

#Apple #Benefits Apple #Apple #Tips #Diabetes

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు