పిల్ల‌ల‌కు కాఫీ ఇస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!  

ఉద‌యం లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు కాఫీ తాగితే.ఎంత మ‌జా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

TeluguStop.com - What Happens Childrens Drink Coffee

ముఖ్యంగా కాఫీ ల‌వ‌ర్స్ రోజులో క‌నీసం రెండు, మూడు సార్లు అయినా తాగుతుంటారు.కొంద‌రు ఉద‌యం బెడ్ కాఫీ తాగ‌నిదే రోజు గ‌డ‌వ‌దు.

అయితే మితంగా కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వొచ్చా లేదా అన్న‌ది మాత్రం చాలా మందికి అవ‌గాహ‌న లేదు.

TeluguStop.com - పిల్ల‌ల‌కు కాఫీ ఇస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే పిల్ల‌లు అడ‌గ‌గానే త‌ల్లిదండ్రులు కాఫీ ఇచ్చేస్తుంటారు.

ఇంత‌కీ పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వొచ్చా.

ఇవ్వ‌కూడ‌దా అంటే ఆరోగ్య నిపుణులు నో అనే అంటున్నారు.అయితే పిల్ల‌ల ఆరోగ్యానికి కాఫీ హానిక‌రం అని చెప్ప‌లేము.

హానిక‌రం కాన‌ప్పుడు ఎందుకు పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వ‌కూడ‌దు అనే సందేహం మీలో వ‌చ్చే ఉంటుంది.ఎందుకంటే.

పిల్ల‌లు సాధార‌ణంగానే చాక్లెట్స్‌, కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తీసుకుంటుంటారు.వీటి ద్వారా పిల్ల‌ల శ‌రీరానికి కెఫిన్ అందుతుంది.

దానికి తోడు కాఫీ కూడా ఇస్తే.పిల్ల‌ల శ‌రీరంలో కెఫిన్ ఎక్కువై ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌కు దారి తీసుకుంటే.

ముఖ్యంగా పిల్ల‌ల శ‌‌రీరంలో కెఫిన్ ఎక్కువైతే.వారి ఎదుగుద‌లను దెబ్బ తీస్తుంది.అలాగే పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వ‌డంతో.గుండె సంబంధిత స‌మ‌స్య‌లు మ‌రియు న‌రాల బ‌ల‌హీన‌త వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా, చిన్న వ‌య‌సులో పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వ‌డం వ‌ల్ల‌.ప‌ళ్లు కూడా దెబ్బ తింటాయ‌ని అంటున్నారు.

అయితే ప‌న్నెండు వ‌య‌సు దాటిన పిల్ల‌ల‌కు అయితే రోజుకు ఒక క‌ప్పు కాఫీ ఇవ్వొచ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.వీరికి కాఫీ ఇవ్వ‌డం వ‌ల్ల మెద‌డు చురుగ్గా ప‌ని చేయ‌డంతో పాటు యాక్టివ్‌గా ఉంటారు.

కానీ, రాత్రి స‌మ‌యంలో మాత్రం పిల్ల‌ల‌కు కాఫీ ఇవ్వ‌రాదు.పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా రాత్రి స‌మ‌యంలో కాఫీ తీసుకోరాదు.

ఎంద‌కంటే, కాఫీ నిద్ర‌ను దెబ్బ తీస్తుంది.

#Good Health #Childrens #Health Tips #Coffee #ChildrensDrink

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు