తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా...వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే చులకన భావన ఉండేది కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పేరు మారుమోగుతుంది.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఇటీవల వరుస వివాదాలలో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందని అందుకే సెలబ్రిటీల వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన నాగార్జున, అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీ ,జానీ మాస్టర్ వంటి వారందరూ కూడా వివాదాలలో నిలిచారు.

నేషనల్ అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్( Jani Master ) అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.దీంతో ఈయనకు నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది.ఇక N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కారణంగా నాగార్జున( Nagarjuna ) కూడా వివాదాలలో నిలిచారు.

అంతేకాకుండా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ గురించి ఆరోపణలు చేయడమే కాకుండా కేటీఆర్ కారణంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారని ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో తీవ్రదుమారం రేపింది.

Advertisement

ఇకపోతే గత నాలుగు రోజుల క్రితం మంచు కుటుంబంలో( Manchu Family ) కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.ఇవి పూర్తిగా వారి వ్యక్తిగత గొడవలే అయినప్పటికీ ఇండస్ట్రీలో భారీగా చర్చలు జరిగాయి.ఇక వర్మ కూడా ఇటీవల అరెస్టు అంటూ వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.

తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ ఇండస్ట్రీని అటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.పాన్ ఇండియా స్టార్ హీరోగా అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలాంటి తరుణంలో ఈయనని పోలీసులు అరెస్టు చేయడంతో ఈయన అరెస్టు దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది.ఇలా వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీల వివాదాలలో చిక్కుకోవడంతో ఇండస్ట్రీ పై చెడు దృష్టిపడింది.

అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?
Advertisement

తాజా వార్తలు