మాజీ మంత్రికి షాకిచ్చిన సినీ నటి.. ఏం జరిగిందంటే?

సినీ నటులకు, రాజకీయ నాయకులకు బాగా దగ్గర సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే.అది ఏ పరంగా అయినా సరే ఆ రెండు రంగాలకు చెందిన వాళ్లకు మంచి సన్నిహితం ఉంటుంది.

 What Happened To The Film Actress Who Shocked The Former Minister-TeluguStop.com

ఇదిలా ఉంటే ఓ సినీ నటికి ఓ రాజకీయ నాయకుడితో సంబంధం ఉండగా ఆ సంబంధం ఏంటనేది ఇప్పటికే అర్థం అవ్వచ్చు.నోమాడ్స్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న మలేషియా బ్యూటీ చాందిని పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె గతంలో ఓ మాజీ మంత్రితో తనకు ఉన్న సంబంధం గురించి బయట పెట్టింది.ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు తమిళ్ నాడు జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రామథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మణికందన్ తో పరిచయం పెంచుకుంది.

 What Happened To The Film Actress Who Shocked The Former Minister-మాజీ మంత్రికి షాకిచ్చిన సినీ నటి.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పరిచయం కాస్తా సహజీవనంగా మారింది.దాంతో చాందిని అతడిని పెళ్లి చేసుకోమని కోరగా అతడు పెళ్లికి అంగీకరించలేదు.

ఇక ఆ విషయాన్ని గతంలో తాను మీడియా ముందుకు వచ్చి చెప్పుకోగా.గత ఐదేళ్లుగా తనను శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకోమని కోరితే చేసుకోనని.

దిక్కున్న చోట చెప్పుకోమని అన్నాడని తెలిపింది.అతనితో ఏకాంతం గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరించాడని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

ఈ విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఇప్పటికే ఆయన కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది.

అంతేకాకుండా సైదాపేట కోర్టులో కూడా చాందిని కేసు వేయగా.తనకు పదికోట్ల పరిహారాన్ని అతడు చెల్లించాలని కోరింది.అంతేకాకుండా చెన్నై లో ఉండి కోర్టు వ్యవహారాలను చూసుకోవాలని, దీనికి అయ్యే నెలవారి ఖర్చులను కూడా మణికందన్ చెల్లించాలని తెలిపింది.దీంతో ఈ విషయం గురించి ఆగస్టు 5న కోర్టులో విచారణ జరగనుంది.

#Chandini #Kollywood #Madras #Tamil Nadu #Manikandan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు