ఆ మహిళా మంత్రి ఏమ‌య్యారు ?  వైసీపీలో హాట్ టాపిక్‌

అధికార పార్టీ వైసీపీలో ఓ మంత్రి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..ఇటీవ‌ల కాలంలో ఎక్కడా క‌నిపించ‌డం లేదు.ఎవ‌రితోనూ క‌ల‌వ‌డం లేదు.దీంతో అస‌లు ఆ మంత్రికి ఏమైంది? అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఇదే విష‌యంపై పార్టీలో సీనియ‌ర్లు కూడా చ‌ర్చించుకుంటున్నారు.ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా యాక్టివ్‌గా ఉన్న పుష్ప శ్రీవాణి.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విష‌యంలో మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిం చారు.ప‌లు టిక్ టాక్ లు చేస్తూ.

 What Happened To That Woman Minister,pushpa Sreevani,ysrcp Leaders,hot Topic In-TeluguStop.com

సోష‌ల్ మీడియాలోనూ డిప్యూటీ సీఎం హ‌ల్‌చ‌ల్ చేశారు.

ఇక‌, త‌న‌కు అప్ప‌గించిన గిరిజ‌న శాఖ విష‌యంలోనూ పుష్ప శ్రీవాణి దూకుడుగా ఉండేవారు.

గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించేవారు.ప్ర‌త్యేకంగా వారికి వ్యాపారాల‌ను అభివృద్ది చేయ‌డంలోను.

వారి ఉత్ప‌త్తులు విక్ర‌యించేలా ప్రోత్స‌హించ‌డంలోను కూడా ముందున్నారు.అయితే.

అనూహ్యంగా పుష్ప శ్రీవాణి మౌనం పాటించ‌డం.రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌స్తు తం ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది.ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంతో పాటు ఆయా ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించేందుకు, త‌న వ‌ర్గానికి మేలు చేసేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా అవ‌కాశం ఉంది.

Telugu Active, Ap, Pushpa Sreevani, Shock, Ycp, Ysrcp-Telugu Political News

అయితే.దీనికి భిన్నంగా మంత్రి పుష్ప శ్రీవాణి మౌనం పాటిస్తుండ‌డం గ‌మ‌నార్హం.ఈ ప‌రిణామాల‌తో అస‌లు ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ సాగుతోంది.గ‌తంలో పుష్ప శ్రీవాణి.సొంత మామ‌. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

దీంతో ఆ వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి.ఇక‌, అప్ప‌టి నుంచి పుష్ప శ్రీవాణి మౌనం పాటిస్తున్నారు.

అయితే.ఈ ఒక్క కార‌ణ‌మేనా? ఇంకా ఏమైనా ఉందా? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ కూడా సాగుతోంది.ఏదేమైనా.ఆది నుంచి కూడా ఆక్టివ్‌గా ఉన్న పుష్ప శ్రీవాణి..కీల‌క‌మైన స‌మ‌యంలో మౌనంగా ఉండ‌డం… పార్టీలో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube