ఆ హీరోతో ఏం కాలేదు.. ఆహా వాళ్ళు అలా చేయమన్నారు: పునర్నవి

ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పునర్నవి భూపాలం తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్ మధ్య ప్రేమ ప్రయాణం మొదలైందని తీవ్రస్థాయిలో వార్తలు వినిపించాయి.

 What-happened To That Hero Aha They Asked Me To-do That Punarnavaipunarnavi, Mar-TeluguStop.com

ఆ వార్తలకు తగ్గట్టుగానే వీరిద్దరూ హౌస్ లో చేసిన రొమాన్స్ నిజమేనని భావించాయి.అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన కొద్ది రోజుల వరకు ఎంతో చనువుగా ఉన్న ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు.

బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న పునర్నవి వెబ్ సిరీస్ లలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా పునర్నవి ఎంగేజ్మెంట్ రింగ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలోనే చర్చలు జరిగాయి.

ఈ విషయంపై నెటిజన్లు స్పందించి కామెంట్లు పెట్టడం చేశారు.అయితే తాజాగా పునర్నవి ఈ విషయం గురించి మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు.

Telugu Marrige, Punarnavi, Raghunandan, Rumours-Movie

రీసెంట్ గా పునర్నవి వేలుకు రింగ్ పెట్టుకొని అయిపోయింది అంతా అయిపోయిందా అంటూ వేలికి ఉంగరం పెట్టుకొని ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ షేర్ చేయడంతో నిజంగానే ఈమెకు పెళ్లి ఫిక్స్ అయిందని నెటిజన్లు భావించారు.కానీ కొంతమంది మాత్రం ఇదేదో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఉంటుందని భావించారు.ఈ విషయంపై పునర్నవి మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోవడం లేదని, పెళ్లికి ఇంకా చాలా టైం ఉందని తెలియజేస్తూ అసలు విషయం చెప్పారు.పునర్నవి కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ ఫిలిం ప్రమోషన్ లో భాగంగా ఈ విధంగా తన వేలికి ఉంగరం పెట్టుకున్న ఫోటోను ఇన్స్టాల్ లో షేర్ చేశారు.

పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పునర్నవి సరసన ఉద్భవ్ రఘునందన్ నటించారు.ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో విడులైంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఆహా టీం వాళ్ళు అలా చేయమంటే చేశామని ఈ సందర్భంగా పునర్నవి తెలిపారు.ఈ విధంగా పోస్ట్ చేయడం ద్వారా ఎన్నో కామెంట్స్ వస్తాయని నేను ముందుగానే భావించినట్లు తెలిపారు.

సాధారణంగా మా సినిమా వస్తుంది చూడండి అంటే రొటీన్ గా అనిపిస్తుంది.కాబట్టి, మా సినిమాను జనంలోకి తీసుకు వెళ్లాలంటే కొత్త వేలో ప్రమోట్ చేయాలని ఆలోచించడం వల్ల ఈ విధంగా ఆహా టీం వాళ్ళు చెప్తేనే చేశామని పునర్నవి తెలియజేశారు.

ఇలాంటి ప్రమోషన్స్ చేయగా, ఎలాంటి కామెంట్స్ వస్తాయో నేను ముందుగానే ప్రిపేర్ అయ్యానని ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube