పంచుమ‌ర్తి ఏమయ్యారు ?  అనారోగ్య‌మే కార‌ణ‌మా ?- What Happened To Panchumarti Is It The Cause Of Illness

What happened to Panchumarti? Is it the cause of illness?, ap, ap political news, latest news, andhra pradesh, political war, political stratagies, anuradha, anuradha Panchumarti, illness, health problem, tdp leaders, tdp women leader - Telugu Andhra Pradesh, Anuradha, Anuradha Panchumarti, Ap, Ap Political News, Health Problem, Illness, Latest News, Political Stratagies, Political War, Tdp Leaders, Tdp Women Leader

టీడీపీ మ‌హిళా నేత‌ల్లో దూకుడుగా ఉండే.పంచుమ‌ర్తి అనురాధ ఏమ‌య్యారు? గ‌డిచిన నెల రోజులుగా ఆమె అడ్ర‌స్ పార్టీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.ఆమె మాట మీడియాలోనూ వినిపించ‌డం లేదు.ఈ విష‌యంలో టీడీపీలోనే భిన్న‌మైన స్వ‌రాలు వినిపిస్తున్నాయి.పార్టీలో కీల‌కంగా ఉన్న మ‌హిళా నేత‌ల్లో ఒక‌రుగా గుర్తింపు పొందిన ఆమె.గ‌తంలో విజ‌య‌వాడ మేయ‌ర్‌గాకూడా చ‌క్రం తిప్పారు.బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ కావ‌డంతో మంచి గుర్తింపు ఇవ్వాల‌నే ఆమె డిమాండ్ కొన్నాళ్లు బాగానే ప‌నిచేసింది.అయితే.ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లో కీల‌క పాత్ర ఆమెకు ల‌భించ‌లేదు.

 What Happened To Panchumarti Is It The Cause Of Illness-TeluguStop.com

అయితే.

చివ‌రాఖ‌రుకు ప‌ద‌వి ద‌క్కినా.దానివ‌ల్ల త‌ను వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు అవ‌కాశం లేద‌ని పంచుమ‌ర్తి భావిస్తున్నారు.

 What Happened To Panchumarti Is It The Cause Of Illness-పంచుమ‌ర్తి ఏమయ్యారు  అనారోగ్య‌మే కార‌ణ‌మా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రోవైపు.మంగ‌ళ‌గిరి టికెట్ ఇవ్వాల‌ని అధినేత చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్నారు.

కానీ, ఈ టికెట్‌ను త‌న‌కుమారుడికి మాత్ర‌మే ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు ఈ ప‌రిణామాల‌తో ఒకింత అల‌క‌బూనిన ఆమె.కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు.ఆ త‌ర్వాత కొంత‌మేర‌కు యాక్టివ్ అయినా.మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు.ఇప్పుడు ఏమైంది.ఇటీవ‌ల ప‌దవి కూడా ఇచ్చారు క‌దా! అని ఆరాతీస్తే.

అనారోగ్యంతో ఉన్నార‌నే స‌మాచారం వ‌స్తోంది.

Telugu Andhra Pradesh, Anuradha, Anuradha Panchumarti, Ap, Ap Political News, Health Problem, Illness, Latest News, Political Stratagies, Political War, Tdp Leaders, Tdp Women Leader-Telugu Political News

కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో ఉన్నార‌నేది వాస్త‌వ‌మే.కానీ, ఇప్పుడు మ‌రింత‌గా ఆరోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్టుట్టాయ‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు.ఇదే విష‌యంపై విజ‌య‌వాడ కు చెందిన పార్టీ కీల‌క నాయ‌కుడు చెప్పింది ఏంటంటే.

ఆమె అనారోగ్యంతో ఉన్నారు.ఇప్ప‌ట్లో పార్టీలో యాక్టివ్‌గా ఉండే ప‌రిస్థితి లేదు అని! నిజానికి పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించిన మ‌హిళా నేత‌ల్లో పంచుమ‌ర్తి ఒక‌రు.

కానీ, ఆమెకు ఆశించిన మేర‌కు గుర్తింపు రాలేద‌నేది వాస్త‌వం.ఇక‌, ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నార‌ని తలియ‌డంతో పార్టీ పూర్తిగా ప‌క్క‌న పెట్టిందా?  లేక ఆమే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది.మ‌రి విష‌యం ఏంట‌నేది ఆమె తిరిగి మీడియా ముందుకు వ‌స్తే.త‌ప్ప తెలియ‌ద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

#Anuradha #Illness #TDP Leaders #Health Problem #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు