ఈట‌ల‌కు ఏమైంది.. టీఆర్ ఎస్ భ‌యంతోనే నిరాధార ఆరోప‌ణ‌లా..?

ఈట‌ల రాజేంద‌ర్ అంటే సౌమ్యుడిగా పేరుండేది.ఆయ‌న ఏదైనా మాట్లాడితే దాదాపు నిజ‌మ‌నే న‌మ్మేంత‌గా ఉంటాయి.

 What Happened To Eeta Trs Is A Baseless Allegation Out Of Fear-TeluguStop.com

కానీ ఎప్పుడైతే కారుదిగి కాషాయ కండువా క‌ప్పుకున్నారో అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో ఒకింత భ‌యంతో పాటు ఒకింత ఇరిటేష‌న్ కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా కోపోద్రిక్తంగా మాట్లాడుతున్నారు.

అంతేకాదు ఇరిటేష‌న్‌తో నిత్యం హ‌రీశ్ రావుపై ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.ఇక మంత్రుల‌పై అయితే నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 What Happened To Eeta Trs Is A Baseless Allegation Out Of Fear-ఈట‌ల‌కు ఏమైంది.. టీఆర్ ఎస్ భ‌యంతోనే నిరాధార ఆరోప‌ణ‌లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నిత్యం హ‌రీశ్ రావు త‌న‌పై గెలిచేందుకు ఎగిరెగిరి పని చేస్తాండ‌ని ఆయ‌న‌కు కూడా త‌న‌లాగే జరుగుతదని గుర్తుపెట్టుకోమంటూ వార్నింగ్‌లు ఇస్తున్నాడు.అలాగే మిగ‌తా మంత్రులపై కూడా ఇలాగే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎక్కడా కూడా పద్ధతి తప్పలేద‌ని, త‌నలాగే టీఆర్ ఎస్ మంత్రుల కొంద‌రు నిజాయితీగా ఉంటున్నార‌ని, కానీ రేపు వారికి కూడా త‌న‌లాగే జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.లోప‌ల ఉన్న బాధ‌ను ఇలా బ‌య‌ట పెడుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Etala, Trs-Telugu Political News

ఇక మంత్రి గంగుల‌పై అయితే ఏకంగా త‌న‌పై మ‌ర్డ‌ర్ ప్లాన్ చేశాడంటూ బాంబు పేల్చుతున్నారు.ఇక దీనిపై గంగుల గ‌రం అవుతూ నిరూపిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్ప‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారుతోంది.మ‌రి ఇంత‌లాగా ఆరోప‌ణ‌లు చేస్తే సింప‌తీ వ‌స్తుంద‌ని ఈట‌ల ఇలా చెబుతున్నారంటూ పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు.నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటామంటూ టీఆర్ ఎస్ నేత‌లు స‌వాళ్లు విసురుతుంటే దీనిపై ఈట‌ల తాత్సారం చేయ‌డ‌మే ఇప్పుడు పెద్ద అనుమానాల‌కు దారి తీస్తోంది.

మొత్తానికి ఈట‌ల కాస్త నిల‌క‌డ త‌ప్పిన‌ట్టే క‌నిపిస్తోంది.

#Etala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు