వాట్ ఈజ్ దిస్ బాలయ్య ! ఆయన ఎందుకు ఇలా అయిపోయాడు ?  

What Happened To Balakrishna-biographical Film,flop,movies,ntr Kathanayakudu,ntr Mahanayakudu,political Updates,politics

అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న నందమూరి బాలకృష్ణ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదం అవుతోంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సహనం, కలుపుగోరుతనం ఉండాలి.అవి ఉంటేనే రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించవచ్చు..

వాట్ ఈజ్ దిస్ బాలయ్య ! ఆయన ఎందుకు ఇలా అయిపోయాడు ? -What Happened To Balakrishna

కానీ బాలయ్య విషయంలో కనీసం ఇవి మచ్చుకకు కూడా కనిపించడంలేదు. బాలయ్య పర్యటనల్లో ఆయన అభిమానులు ఉత్సాహంతో ఆయన దగ్గరకు వస్తే వారిని ఆదరించాల్సిందిపోయి. ఎడాపెడా వాయించడం బాలయ్యకు నిత్యకృత్యంగా మారిపోయింది.

దీంతో బాలయ్య వ్యవహారం టీడీపీ కి పెద్ద తలనొప్పిగా మారింది. తరుచుగా ఆయన మీడియాపై అభిమానులపై అకారణంగా చేయి చేసుకోవడం ఆయన ఫ్యాన్స్‌ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఎప్పుడూ లేని విధంగా బాలయ్య ఎన్నికల ప్రచారంలో ఎక్కడా నవ్వు ముఖం కనిపించడంలేదు.

అయితే బాలయ్యలో ఈ రేంజ్ లో కోపం పెరగడానికి పెద్ద కారణమే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తన తండ్రి జీవితంపై క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు రెండూ ప్లాప్ టాక్ తెచ్చుకోవడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నాడట.

సాధారణంగా బాలయ్య సినిమాలు ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోకపోను కానీ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్లాప్ అయ్యి మొదటికే మోసం వచ్చిందనే అసహనంలో బాలయ్య ఉన్నట్టు ఆయన సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

బాలయ్య ఎన్నికల ప్రచారానికి దిగడం ఇదేమి కొత్త కాదు..

గతంలో అనేక సార్లు పార్టీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఆ పర్యటనల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ, అందరిని నవ్విస్తూ, తాను నవ్వుతూ జోక్స్ పేల్చేవాడు. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహం బాలయ్యలో ఎక్కడా కనిపించడంలేదు.

బాలయ్య అభిమానులను కొట్టడం, తిట్టడం మొదలయిన చర్యలన్నీ ఆయన ఇమేజ్ ను, ఆయన పార్టీ ఇమేజ్ ను కూడా దిగజారుస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. దీనివల్ల బాలయ్య తప్పులను ఎంత కవర్ చేసుకుందామనుకున్నా అది ఆభాసుపాలవుతూనే ఉంది.