పవన్ కోటలో ఏం జరుగుతోంది ..? 'తోట' అలకకు కారణం ఏంటి..?   What Happened In Pawan Janasena     2018-10-31   08:40:34  IST  Sai M

జనసేన పార్టీ లో అధినేత పవన్ ఏరి కోరి కొంతమంది సెలెక్ట్ చేసుకుని మరీ ఒక టీమ్ ఫార్మ్ చేసాడు. జనసేనలో అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి పవన్ ఆ కోటరీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. ఇక పవన్ ఎక్కడికి వెళ్లినా ఆ కోటరీ నాయకులు వెంట ఉండాల్సిందే. అయితే కొద్దీ రోజులుగా పవన్ కోటరీలో ఏదో తెలియని అలజడి రేగినట్టు వార్తలు వస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్టుగా ఉన్నా… ఆ కోటరీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల ప్రాధాన్యత పవన్ తగ్గించేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

జనసేనలో మొదటి నుంచి ఉన్న మారిశెట్టి రాఘవయ్య దాదాపుగా పక్కనపెట్టేశారట పవన్.తాజాగా ఆ పార్టీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉంటూ … పార్టీ కోసం ఛానెల్ ఏర్పాటు చేసిన తోట చంద్రశేఖర్ కు కూడా ప్రాధాన్యత తగ్గినట్టు టాక్. తెలుగుదేశం పార్టీపై పవన్ ఎటాక్ ప్రారంభించిన తర్వాత తోట చంద్రశేఖర్ పార్టీలో కీలకం అయ్యారు. ఉత్తరాంధ్రలో పోరాటయాత్ర ప్రారంభించినప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శి పోస్టు కూడా పవన్ ఇచ్చాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన వ్యక్తే తోట చంద్రశేఖర్. వైసీపీలో ఉన్నప్పటికీ.. ఆయనను తీసుకొచ్చి.. పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు.

What Happened In Pawan Janasena-

అయితే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడంతో పవన్ కోటరీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడాలో కూడా ఆయన చెబుతున్నారు. క్రమంగా తోట చంద్రశేఖర్ ను పవన్ కల్యాణ‌్ పట్టించుకోవడం మానేశారట. దీంతో అన్నీ ఉపయోగించుకుని ఇప్పుడు తనను పక్కన పెట్టడమేమిటన్న అసంతృప్తిలో తోట పవన్ పై గుర్రుగా ఉన్నారట. ఈయన ఎన్నికలవరకు పార్టీలో ఉంటారో లేక సైలెంట్ గా ఉండిపోతారో తెలియదు కానీ జనసేన లో ఇప్పుడు ఈ పరిణామాలు మాత్రం బయటికి పొక్కడంతో రకరకాల చర్చలు మొదలయ్యాయి.