బిగ్ బాస్ సీజన్-5 రిపోర్ట్ : తొలివారం ఎవరేంటో తెలుసుకుందాం..

బిగ్ బాస్ సీజన్-5.గత సీజన్లతో పోల్చితే ఇప్పటి షోలో అంత ఎంటర్ టైన్ మెంట్ కనిపించడం లేదు.

 What Happened In Big Boss Season 5 First Week , Big Boss, Big Boss Seson 5, Big-TeluguStop.com

నాగార్జున కూడా అనుకున్న స్థాయిలో యాక్టివ్ గా కనిపించడంలేదు.ఏ మాత్రం జోష్ నింపే ప్రయత్నం కూడా చేయడం లేదు.

ఈ షో చూసే జనాలకే కాదు.తనకు కూడా ఈ సారి బిగ్ బాస్ పై అంత ఇంట్రెస్ట్ లేనట్లే కనిపిస్తుంది.వచ్చానా? షో చేశానా? వెళ్లానా? అన్నట్లుగానే ఉంది నాగార్జున తీరు.ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ.

 What Happened In Big Boss Season 5 First Week , Big Boss, Big Boss Seson 5, Big-TeluguStop.com

తొలి సీజన్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఆ తర్వాత సీజన్ లో లేదు.ప్రస్తుతం ఇంక అసలే లేదనే టాక్ వినిపిస్తుంది.

తొలి వారమే కాబట్టి కాస్త డల్ గా ఉంది.మున్ముందు షో తీరు ఏమైనా మారుతుందో? ఎప్పటి లాగే మరీ డల్ గా మారుతుందో చూడాలి.

అయితే తొలివారంలో షోలో జరిగిన కొన్ని కీలక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.లోబో బయట ఎలా ఉన్నాడో.బిగ్ బాస్ హౌస్ లోనూ అలాగే ఉన్నాడు.అందరితో సరదాగా ముందుకు వెళ్తున్నాడు.

యాంకర్ రవి మాత్రం మరీ ఎక్కువ చేస్తున్నాడు.తానే విన్ అయ్యేది అనేంత ఓవర్ గా ప్రవర్తిస్తున్నాడు.

అటు ఉమాదేవి మాత్ర షోలో బాగా విసిగిస్తుంది.త్వరలోనే ఆమె షో నుంచి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది.

ఎందుకంటే జాగ్రత్తగా ఆట ఎలా ఆడాలో తనకు తెలియదు.ప్రియా సింగ్ చాలా మెచూర్డ్ గా ఆడుతుంది.

అందరితో కలివిడిగా ముందుకు సాగుతుంది.

Telugu Big Boss, Big Boss Seson, Big Boss Telugu, Lobo, Manas, Natraj, Priya, Sh

ఇక జెస్సీ మాత్రం డల్ గా ఉన్నాడు.ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్లే ఆయన ఆట కొనసాగుతుంది.అనీ మాస్టర్ సున్నితంగా ఉంటుంది.

బయట మాదిరిగానే.ప్రియ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అనేలా ఉంది.

సిరిలో యాక్టివ్ నెస్ తగ్గినా బాగానే ఆడుతుంది.శ్వేత కూడా చాలా డిమ్.

నటరాజ్, సన్నీ, మానస్ ఏదో అలా కొనసాగుతున్నారు.విశ్వతో పోల్చితే శ్రీరామ చంద్ర డల్.కాజల్ చాలా యాక్టివ్ బాగా ఆడుతుంది.హమీదా కూడా ఫర్వాలేదు.

లహరి ఓకే బట్ షణ్ముక్ చాలా చాలా డల్ అని చెప్పుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube