2004 జూన్ 4న బాలయ్య ఇంట్లో ఏం జరిగింది.. జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి ఎవరు.. కాల్పులు ఎందుకు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నటించిన నందమూరి బాలయ్య పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.ఈయన ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.

 What Happened In Balayyas House On June 4 2004 Who Is The Satyanarayana Chaudhary-TeluguStop.com

చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.పైగా వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.

ఇక బాలయ్య వ్యక్తిగతం గురించి ఆయనతో నటించిన నటీనటులు, కుటుంబ సభ్యులు చాలాసార్లు తెలిపారు.ఇక ఈయనకు చాలా కోపం ఎక్కువ అని చాలా మంది పై అరుస్తూ ఉంటారని గతంలో కొందరు అన్నారు.

 What Happened In Balayyas House On June 4 2004 Who Is The Satyanarayana Chaudhary-2004 జూన్ 4న బాలయ్య ఇంట్లో ఏం జరిగింది.. జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి ఎవరు.. కాల్పులు ఎందుకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడప్పుడు తన కోపాన్ని కూడా మీడియా ముందు ప్రదర్శించేవాడు బాలయ్య.ఇదిలా ఉంటే 2004లో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2004లో జూన్ 4న ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన కాల్పులు బాగా హాట్ టాపిక్ గా మారాయి.అసలు ఏం జరిగిందని.

ఎవరు కాల్చారు అని ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇక ఇప్పటికీ ఒక మిస్టరీగా మారింది.

బాలకృష్ణకు జ్యోతిష్యం పై బాగా నమ్మకం ఉండేది.ప్రతిఒక్క విషయంలో జ్యోతిష్కుడు చెప్పిన విధంగా నడుచుకునే వాడు బాలయ్య.

ఏ సినిమాకైనా ఈయన మాటలు నమ్మేవాడు.

ఇక బాలయ్యకు జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి, నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలా సన్నిహితులు.

అయితే బాలయ్య నటించిన ఓ సినిమా విజయవంతం కాలేదు.ఇక దీనికి సంబంధించిన లావాదేవీల గురించి అంతేకాకుండా జూన్ 10న ఆయన బర్త్ డే వేడుకల గురించి జూన్ 4న సత్యనారాయణ చౌదరి, నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్య ఇంట్లో చర్చలు చేశారు.

Telugu Astrologer Satyanarayana Chowdhary, Balakrishna, Balakrishna Mentally Ill, Balakrishna Wife Vasundhara, Firing In Balakrishna House, Hero, Producer Bellamkonda Suresh, Satyanarayana Chaudhary, Tollywood-Movie

అదే సమయంలో అక్కడ కొన్ని కాల్పులు జరిగాయి.ఏమైందో ఎవరికీ తెలియదు.సత్యనారాయణ చౌదరి, బెల్లంకొండ సురేష్ లపై పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో వాళ్లను కూడా హాస్పిటల్ లో చేర్చారు.ఇక ఈ కేసు గురించి పోలీసులు విచారణ చేపట్టారు.

అందులో కాల్పులు జరిగిన రివాల్వర్ బాలయ్య సతీమణి వసుంధర పేరు మీద ఉందని తేలింది.కాని ఆ రివాల్వర్ పేల్చింది ఎవరు అని ఫింగర్ ప్రింట్ లు కూడా లేకపోయేసరికి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Astrologer Satyanarayana Chowdhary, Balakrishna, Balakrishna Mentally Ill, Balakrishna Wife Vasundhara, Firing In Balakrishna House, Hero, Producer Bellamkonda Suresh, Satyanarayana Chaudhary, Tollywood-Movie

అంతేకాకుండా ఈ కేసులో న్యాయస్థానంలో కూడా విచారించగా అందులో బాధితులు బెల్లంకొండ, సత్యనారాయణ చౌదరి ఎవరు కాల్పులు జరిపారో తెలియదని తెలిపారు.ఆ తర్వాత ఈ విషయం గురించి స్పందించిన బాలకృష్ణ న్యాయపరమైన అంశాల్లో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తెలిపాడు.తనపై కేసును దిగువ కోర్టులు కొట్టి వేశాయని, హైకోర్టులో పిటిషన్ దాఖలు అయినట్లు తనకు తెలియదని కూడా తెలిపాడు.

ఇక కొందరు బాలయ్యకు ఆ సమయంలో మతిస్థిమితం సరిగా లేదని ఆయన బాగా తాగి ఉన్నాడని ఆయననే ఈ కాల్పులు జరిపాడు అని బాగా వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత ఈ కేసుపై చాలా దర్యాప్తు జరిగాయి.కానీ ఇందులో అసలు విషయాలు ఇంకా బయట పడకపోగా ఇందులో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయని తెలిసింది.

#Balakrishna #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు