కలలోకి దేవుడు వస్తే... పెద్దలు చెప్పే ఆసక్తికర విషయాలు మీకోసం

మనిషి అన్నప్పుడు కలలు ఖచ్చితంగా వస్తాయి.జీవితంలో పైకి రావాలని కలలు కనని వారికి కూడా నిద్ర పోయినప్పుడు కలలు వస్తాయి.

 What Happened God Comes In Dream Significance Of Dreams, God , Dream, Good Signi-TeluguStop.com

ప్రతి ఒక్కరికి కల అనేది వస్తుంది.జీవితంలో ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి అయినా కల అనేది వస్తుంది.

అయితే కలలు రకరకాలుగా ఉంటాయి.కొందరికి వచ్చిన కలలు గుర్తు ఉండవు, కాని మరి కొందరు మాత్రం వచ్చిన కల మొత్తం పూస గుచ్చినట్లుగా చెబుతూ ఉంటారు.

మరి కొందరు కలలో భయపడే విధంగా దెయ్యాలు, బూతాలు వస్తాయి, మరి కొందరికి అప్పుడప్పుడు చనిపోయిన వ్యక్తులు, దేవతలు కలలోకి వస్తూ ఉంటారు.

దెయ్యాలు, భూతాలు కలలోకి వస్తే భయపడాలి, మరి దేవుడు కలలోకి వస్తే పరిస్థితి ఏంటీ అనేది చాలా మంది అనుమానం.

దైవం రూపం కలలోకి వస్తే ఎలాంటి శకునంగా భావించాలి అనే విషయాన్ని గురించి పెద్దలు ఏమన్నారు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.దైవం కలలోకి వచ్చింది అంటే చేపట్టిన లేదా చేపట్టబోతున్న పనిలో సక్సెస్‌ సాధించబోతున్నట్లుగా భావించవచ్చు.

ఆనందం దక్కబోతుంది, కష్టాలు తొలగబోతున్నాయని భావించవచ్చు.అందుకే దైవం కలలోకి వచ్చిన సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఆనందంగా ముందుకు సాగండి.

ఇక మరి కొందరు చెప్పేది ఏంటీ అంటే దేవుడు కలలోకి వచ్చాడు అంటే నీతో ఏదో చెప్పాలని భావించాడు అని అర్థం అట.గతంలో నీవు ఏదైనా మొక్కు మొక్కి తీర్చకుంటే ఆ మొక్కు అలాగే ఉంటే దేవుడు కలలోకి వచ్చి ఆ మొక్కు తీర్చమని చెప్పినట్లుగా కూడా భావించవచ్చు.ఏదైనా మొక్కు అలాగే ఉంటే దైవం కలలోకి వచ్చి ఆ మొక్కు గురించి గుర్తు చేస్తాడని కూడా పెద్దలు అంటున్నారు.అందుకే దైవం కలలోకి వచ్చిన సమయంలో మొదట మనం గతంలో ఏమైనా మొక్కులు మొక్కుకుని వాటిని మర్చి పోయామా అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి.

ఆ తర్వాత వాటిని తీర్చేందుకు సిద్దం అవ్వాలని పెద్దలు చెబుతున్నారు.మొత్తానికి దైవం కలలోకి రావడం శుభ సూచకం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube